Bro Collections: ‘బ్రో’.. 13 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

Advertisement

పవన్ కళ్యాణ్ – సాయి తేజ్ కాంబినేషన్లో ‘బ్రో’ అనే సినిమా వచ్చింది. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించగా వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు.కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది.టీజర్, ట్రైలర్లు బాగున్నప్పటికీ పాటలు సో సో గానే ఉన్నాయి.జూలై 28 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.

మొదటి షో తోనే మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ టికెట్ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ.. ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. కానీ వీక్ డేస్ లో మాత్రం కలెక్షన్స్ చాలా వరకు డ్రాప్ అయ్యాయి.2 వ వీకెండ్ కొంత పర్వాలేదు అనిపించినా ఆశించిన స్థాయిలో అయితే రాబట్టలేకపోయింది. కానీ వీక్ డేస్ లో మళ్ళీ డౌన్ అయ్యింది. ఒకసారి 13 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 20.46 cr
సీడెడ్ 6.85 cr
ఉత్తరాంధ్ర 6.83 cr
ఈస్ట్ 4.85 cr
వెస్ట్ 4.38 cr
గుంటూరు 4.43 cr
కృష్ణా 3.44 cr
నెల్లూరు 1.74 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 52.98 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 6.19 cr
 ఓవర్సీస్ 7.25 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 66.42 cr (షేర్)

‘బ్రో’ (Bro Movie) చిత్రానికి రూ.97.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.98.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 13 రోజులు పూర్తయ్యేసరికి రూ.65.88 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.32.08 కోట్ల షేర్ ని రాబట్టాల్సి ఉంది.

వీక్ డేస్ లో ఈ మూవీ పెద్దగా రాబట్టలేకపోతుంది. ఈ వారం ‘భోళా శంకర్’ ‘జైలర్’ వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి.. ‘బ్రో’ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news