పవన్ కళ్యాణ్, సాయితేజ్ కాంబోలో తెరకెక్కిన బ్రో మూవీ థియేటర్లలో యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే విదేశాల్లో కూడా బ్రో మూవీ హవా కొనసాగుతుండటం గమనార్హం. బంగ్లాదేశ్, పాకిస్తాన్ లలో నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో టాప్ చిత్రాలలో 8వ స్థానంలో బ్రో సినిమా నిలవడం గమనార్హం.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలలో (Bro Movie) బ్రో హవా కొనసాగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. పవన్ కు మాత్రమే ఈ రికార్డులు సాధ్యమని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విదేశాల్లో కూడా పవన్ సంచలన రికార్డులు సాధిస్తుండటం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని పవన్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. స్ట్రీమింగ్ అయిన రెండు రోజుల్లోనే బ్రో మూవీ అక్కడ ఈ రికార్డ్ ను అందుకుంది.
పవన్ కళ్యాణ్ సినిమాలు యావరేజ్ టాక్ తోనే రికార్డులు సృష్టిస్తుండగా పవన్ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే సాధించే రికార్డులు మామూలుగా ఉండవు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓజీ సినిమాపై హైప్ ఊహించని స్థాయిలో పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తుండటం గమనార్హం.
మరో రెండు రోజుల్లో ఓజీ గ్లింప్స్ రిలీజ్ కానుండగా ఈ గ్లింప్స్ ఎలా ఉండనుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాలో పవన్ ను కొత్తగా చూపించనున్నారని తెలుస్తోంది. ఓజీ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుందని సమాచారం అందుతోంది. ఓజీ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా సంచలన రికార్డులను సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పవన్ పారితోషికం 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండనుందని తెలుస్తోంది. సినిమా సినిమాకు పవన్ కళ్యాణ్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.
మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?
మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!