పవన్ కళ్యాణ్ – సాయి తేజ్ కాంబినేషన్లో ‘బ్రో’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించగా వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు.కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది.టీజర్, ట్రైలర్లు బాగున్నప్పటికీ పాటలు సో సో గానే ఉన్నాయి. జూలై 28 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
మొదటి షో తోనే మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ .. ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి అని చెప్పాలి.ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
8.25 cr
సీడెడ్
2.65 cr
ఉత్తరాంధ్ర
2.53 cr
ఈస్ట్
2.45 cr
వెస్ట్
2.98 cr
గుంటూరు
2.46 cr
కృష్ణా
1.20 cr
నెల్లూరు
0.67 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
23.19 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
2.05 cr
ఓవర్సీస్
4.30 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
29.54 cr (షేర్)
‘బ్రో’ (Bro) చిత్రానికి రూ.97.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.98.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటిరోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా మొదటి రోజు భారీ కలెక్షన్స్ వచ్చాయి. మొదటి రోజు ఈ సినిమా రూ.29.54 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.68.96 కోట్ల షేర్ ని రాబట్టాలి.