డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి (Puri Jagannadh) బీఆర్ఎస్ నేతలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) ప్రమోషన్లో భాగంగా ‘మార్ ముంత చోడ్ చింత’ అనే రెండో లిరికల్ సాంగ్ నిన్న రిలీజ్ అయ్యింది. ఇందులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (కె చంద్రశేఖర్ రావు) గొంతు పెట్టడంతో మరింత హాట్ టాపిక్ అయ్యింది. ‘ఏం చేద్దామంటావ్ మరి’ అంటూ గతంలో కేసీఆర్ ఓ ప్రెస్ మీట్లో పలికిన డైలాగ్ ని ఈ పాట కోసం వాడారు. మాస్ పాట కావడంతో చాలా ఫాస్ట్ గా అది వైరల్ అయ్యింది.
అటు తిరిగి ఇటు తిరిగి ఇది బీఆర్ఎస్ నేతల చెవిలో పడింది. వాళ్ళు దీనిపై మండిపడటమే కాకుండా పూరి జగన్ కి వార్నింగ్ కూడా ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు ‘ఆ పాటలో కెసిఆర్ గొంతుని వెంటనే తొలగించాలని.. లేదంటే దర్శకుడు పూరి జగన్ ఇంటిని ముట్టడిస్తామని బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు కూడా వార్నింగ్ ఇచ్చారట. గతంలో పూరి జగన్నాథ్- పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాంబినేషన్లో వచ్చిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ (Cameraman Gangatho Rambabu) సినిమాలో తెలంగాణ ఉద్యమంపై కించపరిచే విధంగా డైలాగులు ఉన్నాయని కూడా..
అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. ఆ డైలాగ్స్ ను వెంటనే తొలగించకపోతే ‘పూరి జగన్నాథ్ సినిమాలని తెలంగాణలో ఆడనివ్వం’ అంటూ నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. ఫైనల్ గా పూరి ఓ మెట్టు కిందకి దిగి.. వారిని నొప్పించిన డైలాగులు డిలీట్ చేయడంతో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. మరి ఇప్పుడు ‘మార్ ముంత చోడ్ చింత’ పాటలోని కేసీఆర్ గొంతుపై పూరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.