Buchi Babu: టాలీవుడ్ టూ బాలీవుడ్, పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు పెద్ద స్కెచ్ వేసాడు..!

బాహుబలి మూవీతో దర్శక ధీరుడు రాజమౌళి టాలీవుడ్ నుంచి పాన్ ఇండియన్ మూవీస్ కి దారులు తెరిచాడు. అదే దారిలో పాన్ ఇండియా లెవెల్లో సుకుమార్ డైరెక్షన్లో , అల్లుఅర్జున్ హీరోగా పుష్ప 1&2 లతో తెలుగు సినిమా స్థాయిని ఇంకా పెంచారు. ఈ ట్రెండ్ ని కొనసాగిస్తూ తెలుగు దర్శకులు పాన్ ఇండియా ప్రాజెక్టులను సొంతం చేసుకుంటున్నారు.

Buchi Babu

మొదటి సినిమా ఉప్పెన మూవీతోనే 100 కోట్ల బ్లాక్ బస్టర్ కొట్టాడు డైరెక్టర్ బుచ్చిబాబు సానా. ఈ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న రెండవ సినిమా “పెద్ది” అన్న విషయం తెల్సిందే . రీసెంట్ గా పెద్ది నుంచి వచ్చిన ఫస్ట్ సింగల్ చికిరి చికిరి సాంగ్ ఆన్ లైన్ లో ట్రెండింగ్ లో ఉంది. పెద్ది మూవీ కి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా తన నెక్స్ట్ మూవీ కోసం ఇండియాస్ బిగెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరైన షారుఖ్ ఖాన్ తో ఒక మూవీ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం.

బుచ్చిబాబు తన గురువైన సుకుమార్ సహకారం తో తన కథను షారుఖ్ ఖాన్ వద్దకు చేర్చినట్లు టాక్. అయితే షారుఖ్ ఖాన్ ప్రీవియస్ మూవీ జవాన్ , దక్షిణాది దర్శకుడైన అట్లీ తోనే చేసాడు. ఈ మూవీ 1000 కోట్ల కలెక్షన్ లతో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. పెద్ది మూవీని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ తోనే షారుఖ్ ఖాన్ మూవీ కూడా ఉండబోతుంది అనేది గట్టిగ వినిపిస్తున్న సమాచారం. షారుఖ్ ఖాన్ కూడా మైత్రి మూవీస్ లో సినిమా చేయటానికి సిద్ధం గా వున్నారు అంట.

స్టడీగా కలెక్ట్ చేసినా.. ‘జటాధర’ కి కష్టంగానే ఉంది

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus