Buchi Babu: బుచ్చిబాబు కూడా కొరటాల చేసిన తప్పే చేస్తున్నాడా?

పెద్ద సినిమాల్లో హీరోయిన్ల పాత్రల పై ఎప్పుడూ కొన్ని మిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి. ‘వాళ్ళు కేవలం గ్లామర్ కే పరిమితం’ అని.! ఇది ఎక్కువ శాతం నిజమే. తెలుగు సినిమాల్లో హీరోయిన్లను గ్లామర్ షోకి, పాటలకే అంకితం చేస్తుంటారు దర్శకులు. కానీ కొంతమంది దర్శకులు మాత్రం ఇది తప్పు అని ప్రూవ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దర్శకుడు కొరటాల శివని తీసుకుందాం. అతను డైరెక్ట్ చేసిన ‘శ్రీమంతుడు’ సినిమాలో హీరోయిన్ శృతి హాసన్ పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది.

Buchi Babu

హీరోకి గోల్ ఫిక్స్ చేసి కథని ముందుకు తీసుకెళ్లడంలో ఆ పాత్ర కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. అలాంటి కొరటాల శివ.. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ను టాలీవుడ్ కి తీసుకొస్తున్నాడు అంటే.. కచ్చితంగా ఆమె కోసం మంచి పాత్ర రాశాడేమో అనుకుంటాం. కానీ ‘దేవర’ లో జాన్వీ కపూర్ అందాల ఆరబోతకు, డబుల్ మీనింగ్ డైలాగులకే పరిమితమైంది.’దేవర’ అనేది కోస్టల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన రా అండ్ రస్టిక్ మూవీ. అలాంటి సినిమాలో జాన్వీ అర్బన్ లుక్ లో కనిపించడమే కామెడీ అనుకుంటే.. ఆమె గ్లామర్ షో, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇంకా చిరాకు తెప్పిస్తాయి.

పోనీలే కొరటాల దెబ్బేసినా.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా కచ్చితంగా జాన్వీ కపూర్ కి ‘పెద్ది’ లో మంచి పాత్ర ఇచ్చి ఉంటాడు అని అంతా ఆశించారు. కానీ తాజాగా రిలీజ్ చేసిన జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే.. బుచ్చిబాబు కూడా ట్రాక్ తప్పిన ఫీలింగ్ కలిగిస్తుంది. ఈ సినిమాలో ‘అచ్చియమ్మ’ అనే పాత్రలో జాన్వీ కపూర్ నటిస్తుంది. ఇది కోస్టల్ బ్యాక్ డ్రాప్ మూవీ కాబట్టి.. ఆమె మేకోవర్ కొత్తగా ఉంటుంది, రంగస్థలంలో సమంత, పుష్పలో రష్మిక రేంజ్లో నేచురల్ గా ఉంటుంది అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే.. ‘పెద్ది’ లో ‘అచ్చియమ్మ’ కూడా అర్బన్ లుక్లోనే కనిపిస్తుంది. మరి పాత్రైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో లేదో చూడాలి.

‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘ఓజి’ సెంటిమెంట్ ‘మాస్ జాతర’ కి కలిసొస్తుందా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus