2025 లో బిగ్గెస్ట్ హిట్స్ అంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమానే. ఆ సినిమా దాదాపు రూ.300 కోట్లు కలెక్ట్ చేసింది. ఇటీవల వచ్చిన పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా కూడా రూ.275 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. కానీ లాభాల పరంగా చూసుకుంటే ‘ఓజి’ కంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఎక్కువ. ఇవి తప్ప 2025 లో మిగిలిన ఏ సినిమా కూడా వాటి స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది అనేది వాస్తవం. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘ఓజి’ సినిమాలకి ఓ కామన్ పాయింట్ ఉంది. బహుశా దాన్ని చాలా మంది గమనించకపోవచ్చు.
విషయం ఏంటంటే.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి రమణ గోగుల ఒక పాట పాడారు. ఆ సినిమాకి బోలెడంత బజ్ తీసుకొచ్చిన ‘గోదారి గట్టుమీద రామసిలకవే’ అనే పాటని పాడింది రమణ గోగులనే. అది చార్ట్ బస్టర్ అవ్వడం వల్లనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ కి మంచి హైప్ వచ్చింది. అంతేకాకుండా ఆ సినిమాల్లో ‘లల్లాయిరే..’ అనే పాట ఉంటుంది.
దానికి రఘురామ్ అలియాస్ ఆర్.ఆర్.ధృవన్ సాహిత్యం సమకూర్చారు. ఇక ‘ఓజి’ సినిమా విషయానికి వస్తే… ఇందులో కూడా ‘లెట్స్ గో జానీ’ అనే బ్యాక్ గ్రౌండ్ సాంగ్..ని రమణ గోగుల పాడారు. అలాగే ‘హంగ్రీ చీటా’ అనే పాటని రఘురామ్ అలియాస్ ధృవన్ రాశారు. ఇవి 2 కూడా ఆడియన్స్ కి, ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చాయి.
అలాగే ‘మాస్ జాతర’ సినిమాకి కూడా ధృవన్ ఒక పాట రాశారు. దాన్ని రమణ గోగుల పాడటం జరిగింది. సినిమాలో ఆ పాట రవితేజ అభిమానులకు, ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా ఉంటుందట. మరి ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘ఓజి’ సెంటిమెంట్ కలిసొచ్చి ‘మాస్ జాతర’ కూడా పెద్ద హిట్ అవుతుందేమో చూడాలి.