భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి మిక్స్ డ్ టాక్ తో అభిమానులని మెప్పించలేకపోయిన పాన్ ఇండియా మూవీ ” గేమ్ చేంజర్ “. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా , కియారా అద్వానీ హీరోయిన్ గా , శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ స్వరాలు అందించారు. మూవీ ఫలితం ఎలా ఉన్నా, మ్యూజిక్ తో తన మార్క్ చూపించాడు ఏ ఆర్ రెహమాన్. అయితే గేమ్ చేంజర్ తరువాత రాంచరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ” పెద్ది “. బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ కధానాయికగా చేస్తుండగా , కన్నడ శివ రాజ్ కుమార్ & త్రిష కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి కూడా ఏ ఆర్ రెహమాన్ యే మ్యూజిక్ అందిస్తున్నారు.
“పెద్ది” మూవీ రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్.. ఈ చిత్రంపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. మూవీషూటింగ్ దాదాపుగా కంప్లీట్ చేసుకుంది. ఇంకా కొంత భాగం షూటింగ్ జరుగుతుండగా, మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్.
మ్యూజిక్ మాస్ట్రో ఎఆర్ రెహమాన్, పాపులర్ సింగర్ మోహిత్ చౌహాన్, దర్శకుడు బుచ్చి బాబు కలిసి కనిపించిన ఫొటోను రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్ చేశారు.“ఏం ప్లాన్ చేస్తున్నారు? ఏం జరగబోతుంది?” అంటూ చరణ్ క్యూట్‌గా ప్రశ్నించగా… వెంటనే రెహమాన్, బుచ్చి బాబు కూడా ఆటపట్టించేలా “చికిరి.. చికిరి సార్” అంటూ రిప్లై ఇచ్చారు.ప్రస్తుతం ఈ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇది ఇలా ఉండగా, రీసెంట్ గా కొద్ది నిమిషాల క్రితం డైరెక్టర్ బుచ్చిబాబు సన & ఎఆర్ రెహమాన్ ఇంట్రెస్టింగ్ సంభాషణ ఒకటి వీడియో రూపంలో యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. ఇందులో హీరో , హీరోయిన్ ని మొదటిసారిగా చూసినప్పుడు” తన ఫ్రెండ్ తో అలంకరణ అక్కరలేని చికిరి రా ఈ అమ్మాయి ” అని మాట్లాడుతున్న సందర్భంగా ఈ పాటను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. వీడియో చివర్లో పెద్ది ఫస్ట్ సింగిల్ ఈ నెల 7న రిలీజ్ చేయనున్నట్లు తెలియజేసారు. ఈ చిత్రంలో జాన్వీ “అచ్చియమ్మ” పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, వృద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్నారు.