సోషల్ మీడియా యుగంలో, అందులోని AI అందుబాటులోకి వచ్చాక ఏది నిజమో, ఏదో అబద్ధమో అర్థం కావడం లేదు. గత రెండు రోజులుగా కె.సుధ అలియాస్ రంగసుధా అనే అమ్మాయి ప్రైవేట్ వీడియో నెట్లో చక్కర్లు కొట్టింది. ఆమె ఎలాగూ సోషల్ మీడియాలో, ప్రత్యేకించి ఇన్స్టాగ్రామ్ లో తన ఎక్స్ క్లూజివ్ సబ్ స్క్రైబర్స్ కోసం కాస్త క్లీవేజ్ కనిపించేలా ఫోటోలు, వీడియోలు పెడుతుంది కాబట్టి, ఆ వీడియోలు కూడా అందులో భాగమేమో అనుకున్నారు జనాలు.
కట్ చేస్తే.. సుధతో చాన్నాళ్లుగా క్లోజ్ గా ఉన్న రాధాకృష్ణ అనే వ్యక్తి ఆ వీడియోలు, కొన్ని ఫోటోలు ఆమెను బెదిరించడం కోసం లీక్ చేశాడని ఇవాళ స్పష్టమైంది. అది కూడా ఆమె స్వయంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాక. ఇన్స్టాగ్రామ్ లో నాభి అందాలను ఆర్భాటంగా బహిర్గతపరుస్తూ ఫేమ్ సంపాదించుకున్న సుధా, మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా డెబ్యూ కూడా ఇచ్చింది. ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు, అది వేరే విషయం అనుకోండి. అయితే.. ఈమధ్య ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రైబర్ల కోసం కొన్ని హాట్ ఫోటోస్ పోస్ట్ చేయడం ఆరంభించింది.
ఆ ఫోటోలు ట్విట్టర్లో దర్శనమిస్తూనే ఉంటాయి. మరి ఈ రాధాకృష్ణ ఎవరు, సుధను ఎందుకు బెదిరిస్తున్నాడు? వీళ్లిద్దరికీ గొడవ ఏంటి? అతడి వద్ద సుధకు చెందిన వీడియోలు ఇంకా ఏమున్నాయి? అనేది తెలియాల్సి ఉండగా.. సోషల్ మీడియా కాలంలో ఇవన్నీ షరామాములే అనే స్థాయికి చేరిపోయింది పరిస్థితి. ఏదేమైనా ఒక అమ్మాయి ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను నెట్లో పెడతానని బెదిరించడం అనేది సమంజసం కాదు. ఈ విషయంలో మన చట్టాలు కూడా చాలా స్ట్రిక్ట్. ఇలాంటి ఇన్సిడెంట్స్ రెగ్యులర్ గా జరుగుతున్నప్పటికీ.. ప్రేమ జంటలు ఇంకా తమ రాసలీలల్ని కెమెరాల్లో బంధించడానికి జ్ఞాపకాలుగా చెప్పుకుంటారెందుకో.