Anuparna Roy: మన దేశంలో తొలి దర్శకురాలిగా ఆమెకు గౌరవం.. ఏ సినిమా అంటే?

భారతీయ మహిళా దర్శకురాలు అనుపర్ణ రాయ్‌ ప్రపంచ వేదికగా అరుదైన గౌరవం అందుకున్నారు. ప్రఖ్యాత వెనిస్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అనుపర్ణ రాయ్‌ రికార్డు సృష్టించారు. ఒరిజోంటి కేటగిరీలో ఉత్తమ దర్శకురాలిగా పురస్కారం గెలుచుకున్నారు. దీంతో ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ దర్శకురాలిగా నిలిచారు. ‘సాంగ్స్‌ ఆఫ్‌ ఫర్‌గాటెన్‌ ట్రీస్‌’ సినిమాకుగాను అనుపర్ణ రాయ్‌కి ఈ పురస్కారం వచ్చింది. తెరకెక్కించి తొలి సినిమాకే ఈ అవార్డు రావడం గమనార్హం.

Anuparna Roy

ఇక ఒరిజోంటి సెక్షన్‌కు భారత్‌ నుంచి ఎంట్రీ దక్కించుకున్న ఏకైక సినిమా కావడం ‘సాంగ్స్‌ ఆఫ్‌ ఫర్‌గాటెన్‌ ట్రీస్‌’ కావడం ఆసక్తికరం. ఇక తనకు వచ్చిన ఈ పురస్కారాన్ని భారతీయ మహిళలందరికీ అంకితమిస్తున్నట్టు అనుపర్ణ రాయ్‌ చెప్పారు. ఇలాంటి మరిన్ని కథలు తెరకెక్కించేందుకు ఈ విజయం స్ఫూర్తినిస్తుందని కూడా చెప్పారు.

‘రన్‌ టు ది రివర్‌’ అనే షార్ట్‌ఫిల్మ్‌తో 2023లో అస్టిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించారు అనుపర్ణ. దానికి వివిధ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు దక్కాయి. ముంబయిలో ఉద్యోగం చేస్తూనే ‘సాంగ్స్‌ ఆఫ్‌ ఫర్‌గాటెన్‌ ట్రీస్‌’ సినిమాను రూపొందించారు. ఆ తర్వాత అనురాగ్‌ కశ్యప్‌ సమర్పణలో రూపొందిన ఈ సినిమాలో ముంబయికి వలస వెళ్లిన ఇద్దరు మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారనే విషయాన్ని రియలిస్టిక్‌గా చూపించారు. అందుకే పురస్కారాలు దక్కాయి.

1949 నుండి వెనిస్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘గోల్డెన్‌ లయన్‌’ అవార్డులను అందిస్తున్నారు. ఇండిపెండెంట్‌ చిత్రాలను ప్రోత్సహించేందుకు 20 ఏళ్ల క్రితం అందులోనే ఒరిజోంటి అవార్డును ప్రవేశపెట్టారు. ఇప్పుడు అనుపర్ణ రాయ్‌ అందుకున్న అవార్డు ఇదే. ఇక ఆగస్టు 27 నుండి సెప్టెంబరు 6 వరకు జరిగిన చలన చిత్రోత్సవంలో హాలీవుడ్‌ సినిమా ‘ఫాదర్‌ మదర్‌ సిస్టర్‌ మదర్‌’ ఉత్తమ చిత్రంగా గోల్డెన్‌ లయన్‌ అవార్డు అందుకుంది.

సంక్రాంతి వార్‌.. తేలిపోయింది అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus