Bujji & Bhairava Review in Telugu: బుజ్జి అండ్ భైరవ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

  • May 31, 2024 / 10:30 PM IST

Cast & Crew

  • ప్రభాస్ (Hero)
  • NA (Heroine)
  • బ్రహ్మానందం , కమల్ హాసన్ (Cast)
  • నాగ్ అశ్విన్ (Director)
  • అశ్వినీదత్, స్వప్న దత్, ప్రియాంక దత్ (Producer)
  • సంతోష్ నారాయణన్ (Music)
  • డిజార్డజే స్టోజిల్జ్కోవిక్ (Cinematography)

ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కలయికలో రూపొందుతున్న ‘కల్కి 2898 AD ‘ పై భారీ అంచనాలు ఉన్నాయి. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని ఏకంగా రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూన్ 27 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. దీంతో ప్రమోషన్స్ ను కూడా సరికొత్త పద్దతిలో ప్లాన్ చేశారు.ఇందులో భాగంగా ‘కల్కి 2898 AD ‘ లో ఎంతో కీలకమైన బుజ్జి, భైరవ పాత్రలను పరిచయం చేస్తూ ఓ యానిమేటెడ్ వెబ్ సిరీస్ ని రూపొందించారు. అమెజాన్ ప్రైమ్లో 2 ఎపిసోడ్లుగా ఇది అందుబాటులోకి వచ్చింది. మరి ఇది ఎలా ఉందో తెలుసుకుందాం రండి :

కథ : బుజ్జి, భైరవ పాత్రలను పరిచయం చేస్తూ ఈ సిరీస్ సాగుతుంది. BU – JZ – 1 అనే కోడ్ నేమ్ ఉన్న ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డివైజే ఈ బుజ్జి. ఈ డివైజ్ ను ఓ వెహికల్ కి అటాచ్ చేయగా.. వాటికి సరైన గైడెన్స్ ఇస్తూ 99 మిషన్లు సక్సెస్ అయ్యేలా చేస్తుంది. అయితే 100వ మిషన్‌ కంప్లీట్ అయ్యే టైంకి… ఓ దాడి జరుగుతుంది. దీంతో బుజ్జి ఉన్న వెహికల్ ధ్వంసం అయిపోతుంది. అందువల్ల 100 మిషన్లు పూర్తి చేసి కాంప్లెక్స్‌కి షిఫ్ట్ అవ్వాలనే బుజ్జి కోరిక మధ్యలోనే నిలిచిపోతుంది. మరోపక్క భైరవ పాత్ర ప్రకారం అతను మిలియన్ల కొద్దీ యూనిట్లు(2898 లో డబ్బు లాంటిది) సంపాదించి కాంప్లెక్స్ కి షిఫ్ట్ అవ్వాలనేది అతని డ్రీం.

ఇతని ఇంటి ఓనర్ గా బ్రహ్మానందం కనిపించారు. రెండేళ్లుగా అద్దె చెల్లించలేని అసమర్థ స్థితిలో భైరవ ఉంటాడు. అతన్ని ఖాళీ చేసేయమని నిత్యం ఆ ఓనర్ సాధిస్తూ ఉంటాడు. ఇలాంటి టైంలో భైరవకి బుజ్జి దొరుకుతుంది. ఆమె సలహా ప్రకారం ఓ కారు తయారు చేసుకుంటాడు భైరవ. అయితే ఆ కార్ తో భైరవని చీట్ చేసి కాంప్లెక్స్ కి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తుంది బుజ్జి. కానీ ఆమె వెళ్ళలేదు? అది ఎందువల్ల? బుజ్జి సలహాతో భైరవ సాధించింది ఏంటి? అనేది ఈ సిరీస్ యొక్క సారాంశం.

నటీనటుల పనితీరు : ఇందులో ప్రధానంగా భైరవ(ప్రభాస్) పాత్రని చూపించారు. బుజ్జి పాత్రని ఓ యానిమేటెడ్ డివైజ్ గా చూపించారు. బ్రహ్మానందం పాత్రకి పేరు అంటూ ఏమీ లేదు. కానీ ప్రభాస్ పాత్రకి, బ్రహ్మానందం పాత్రకి మధ్యలో వచ్చే సంభాషణలు చాలా కామెడీగా అనిపిస్తాయి. ప్రభాస్ డైలాగ్ డెలివరీ ‘బుజ్జిగాడు’ రోజుల్ని గుర్తు చేస్తుంది. అలాగే ఓ చోట పెద్ద విగ్రహం ఉంటుంది. అది కమల్ హాసన్ ని పోలి ఉంటుంది. అంతకు మించి ఆ పాత్ర యొక్క లోతుని ఇందులో చూపించలేదు. ఇక అశ్వద్ధామ పాత్ర గురించి ఇందులో ఎలాంటి హింట్ ఇవ్వలేదు.

సాంకేతిక నిపుణుల పనితీరు : ‘కల్కి 2898 ad ‘ ప్రమోషన్స్ ని దర్శకుడు నాగ్ అశ్విన్ మొదటి నుండి వినూత్నంగా ప్లాన్ చేస్తూ వస్తున్నాడు. అదే సమయంలో బాగా ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పాలి. నిర్మాతతో డబ్బు.. ఎక్కడ పెట్టించాలో, ఎలా పెట్టించాలో కూడా ఇతను ప్లాన్ చేసుకున్న విధానం బాగుంది. అలాగే ‘సినిమా ఏ జోనర్లో ఉంటుంది?’ అనేది గ్లింప్స్ ద్వారా చూపించాడు. ఆ గ్లింప్స్ ని విదేశాల్లో లాంచ్ చేసి.. ప్రపంచం మొత్తం ‘కల్కి 2898 AD’ వైపు చూసేలా చేశాడు. శంభల నగరంలో కల్కి పుడతాడనేది పురాణాలు చెబుతున్నాయి. ఈ సిరీస్ లో కాంప్లెక్స్‌కు వెళ్తున్న వెహికిల్స్‌పై శంభల సిటీకి చెందిన రెబల్స్.. దాడి చేసినట్లు హింట్ ఇచ్చాడు.

2898 సంవత్సరంలో డబ్బు రూపాయల్లో ఉండదు, యూనిట్స్ లో ఉంటుంది అని ఈ సిరీస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు నాగ్ అశ్విన్. అంతా బాగానే ఉంది కానీ సైన్స్ ని.. పురాణాల్ని ఆధారం చేసుకుని తీసిన ఈ సైన్స్ ఫిక్షన్ కమ్ టైం ట్రావెల్ మూవీ… మాస్ సెంటర్ ఆడియన్స్ కి ఎంత వరకు అర్థమవుతుంది? పోనీ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనే అనుమానాలు కూడా రేకెత్తించింది ఈ సిరీస్. మరోపక్క ప్రభాస్, బ్రహ్మానందం..ల కామెడీ విజువల్స్ చూస్తుంటే ‘కల్కి 2898 AD’ లో కామెడీ కూడా ఉంటుందా అనే డౌట్స్ కూడా అందరికీ వస్తున్నాయి.

విశ్లేషణ : మొత్తంగా ‘ ‘కల్కి 2898 ad ‘ వరల్డ్ ఎలా ఉంటుంది?’ అనేది ఈ ‘బుజ్జి అండ్ భైరవ’ యానిమేటెడ్ వెబ్ సిరీస్ ద్వారా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ‘తన సినిమా కాన్సెప్ట్ ఇలా ఉంటుంది’ అనేది చెబుతూ ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేశాడు. ఎక్కడా బోర్ కొట్టేలా అయితే ఈ సిరీస్ లేదు. టైం పాస్ కి ఇంట్లో కూర్చుని హ్యాపీగా ఒకసారి చూడొచ్చు.

రేటింగ్ : 2.75/5

Click Here to Read in ENGLISH

Rating

2.75
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus