‘మన శంకర్ వరప్రసాద్ గారు’(Mana ShankaraVaraprasad Garu).. ట్రైలర్ వచ్చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవిని ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడు అనే విషయం పై క్లారిటీ ఇచ్చేశాడు. చిరు కామెడీ టైమింగ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దాన్నే ఈ సినిమాలో హైలెట్ చేయబోతున్నాడు అని ట్రైలర్లోని ప్రతి ఫ్రేమ్ చెబుతుంది. చిరు లుక్స్ కూడా బాగున్నాయి. గత సినిమాలతో పోలిస్తే ఇందులో ఫిట్ గా కనిపిస్తున్నారు.
నయన్ తో ఆయన చేసే కామెడీ ‘అన్నయ్య’ సినిమా రోజులను గుర్తుచేసింది. అలాగే విలన్ శరత్ సక్సేనా కూడా ట్రైలర్లో కనిపించారు. ఆయన్ని చూస్తే.. ‘ముఠామేస్త్రి’ వైబ్స్ కలిగాయని చెప్పొచ్చు. ట్రైలర్ చివర్లో వెంకటేష్ కూడా ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళ మధ్య కన్వర్జేషన్, అలాగే వాళ్ళ కాంబో అభిమానులకు ఐ ఫీస్ట్ ఇవ్వడం గ్యారెంటీ అని చెప్పడంలో కూడా సందేహం లేదు.
అంతా బాగానే ఉంది కానీ.. ఎటొచ్చి ఈ ట్రైలర్లో బుల్లి రాజు అలియాస్ రేవంత్ లేకపోవడం.. కొంత డిజప్పాయింట్మెంట్. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ లో అత్యంత కీలక పాత్ర పోషించింది బుల్లిరాజు అని చెప్పడంలో సందేహం లేదు. అతన్ని చిరు ఏరి కోరి ‘మన శంకర్ వర ప్రసాద్ గారు’ లోకి ఎంపిక చేసుకోవాల్సిందిగా దర్శకుడు అనిల్ రావిపూడిని కోరారు. ‘మీసాల పిల్లా’ సాంగ్ ప్రోమో పై ట్రోలింగ్ జరిగినప్పుడు.. బుల్లిరాజుని రంగంలోకి దింపి ఆ ట్రోలింగ్ కి ఫుల్స్టాప్ పెట్టారు.
అయితే ట్రైలర్లో బుల్లిరాజు లేకపోవడం అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. బహుశా ట్రైలర్లో బుల్లిరాజు కనిపిస్తే చిరు, వెంకీ..లు సైతం డామినేట్ అయిపోతారు అని అనిల్ రావిపూడి అండ్ టీం భావించి ఉండొచ్చు.