‘శ్రీరస్తుశుభమస్తు’ శాటిలైట్ రైట్స్ అమ్ముడిపోయాయి!

అల్లు శిరీష్ హీరోగా నటించిన చిత్రం ‘శ్రీరస్తుశుభమస్తు’ సినిమా విడుదలయిన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎంతగానో ఆదరిస్తున్నారు. సినిమాలో కామిడీ, హ్యూమన్ ఎమోషన్స్ బాగా పండాయి. లాభాల బాటలో ఈ సినిమా దూసుకుపోతుంది. శిరీష్ కెరీర్ కు ఈ సినిమా ప్లస్ అయింది.

ఈ సినిమా హిట్ లిస్ట్ లోకి చేరడంతో శాటిలైట్ రైట్స్ కోసంచాలా చానెళ్లు ప్రయత్నించాయి. ఫైనల్ గా జెమిని టీవీ వారు దాదాపు మూడు కోట్ల రూపాయలను చెల్లించి మరీ ఈ హక్కులను పొందారట. ఈ సినిమాతో పాటు విడుదలయిన ‘మనమంతా’ చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ మాటీవీ వారు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎంత రేటు పెట్టి కొన్నారనే విషయం తెలియాల్సివుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus