Bunny Vaas: బన్నీ కథ వినాలంటే ఆ వ్యక్తి కచ్చితంగా ఉండాలా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా పుష్ప ది రూల్ సినిమా ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ కానుంది. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక పాన్ ఇండియా మూవీ ఫిక్స్ కాగా సెప్టెంబర్ నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బన్నీ సినిమా సినిమాకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు.

వరుస సినిమాలతో సత్తా చాటుతున్న బన్నీ పుష్ప2 సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బన్నీ గత సినిమాలు సైతం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. అయితే బన్నీకి అత్యంత సన్నిహితులలో బన్నీవాస్ ఒకరు. అయితే బన్నీవాస్ తాజాగా ముఖ్య గమనిక ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బన్నీ కథ వినాలంటే ముఖ్య గమనిక మూవీ హీరో విరాన్(వంశీ) కచ్చితంగా ఉండాలని పేర్కొన్నారు.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో విరాన్ కూడా ముఖ్యమైన మెంబర్ అని బాల్యం నుంచి విరాన్ తెలుసని ఇప్పుడు విరాన్ కథలు వినే స్థాయికి ఎదిగాడని బన్నీవాస్ చెప్పుకొచ్చారు. బన్నీ కథ వినాల్సి వస్తే విరాన్ ను కూడా పిలవాలని చెప్పేవారని ఆయన అన్నారు. విరాన్ అంటే బన్నీకి ఎంతో ఇష్టమని బన్నీవాస్ తెలిపారు. తొమ్మిదేళ్ల క్రితం హీరో కావాలని భావించిన విరాన్ ముఖ్య గమనిక సినిమాతో ఆ కలను నెరవేర్చుకున్నాడని (Bunny Vaas) బన్నీవాస్ చెప్పుకొచ్చారు.

బన్నీ సపోర్ట్ తో సినిమాల్లోకి వస్తున్న విరాన్ ముఖ్య గమనిక సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. మరోవైపు పుష్ప2 సినిమా షూట్ శరవేగంగా జరుగుతోందని తెలుస్తోంది. సినిమాలో గంగమ్మ జాతర ఎపిసోడ్ 12 నిమిషాల పాటు ఉంటుందని ఈ ఎపిసోడ్ ను ఏకంగా 40 రోజుల పాటు షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus