Bunny, Balakrishna: అక్కడ కూడా పుష్పరాజ్ సత్తా చాటుతున్నారా?

స్టార్ హీరో బాలకృష్ణ తాజాగా అఖండ మూవీ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ పాకిస్తాన్ లో కూడా అఖండ సినిమా గురించి మాట్లాడుతున్నారని వెల్లడించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా అఖండ గురించి చర్చ జరుగుతోందని బాలయ్య పేర్కొన్నారు. బాలయ్య చేసిన కామెంట్లు విని బాలయ్య అభిమానులు సంతోషిస్తున్నారు. అఖండ పాకిస్తాన్ లో రిలీజ్ కాకపోయినా అక్కడ ఈ సినిమా గురించి చర్చ జరుగుతుండటం గమనార్హం.

అయితే మరోవైపు బన్నీ పుష్ప ది రైజ్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. బాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలకు సమానంగా పుష్ప పార్ట్1 కలెక్షన్లను సాధిస్తోంది. ఫుల్ రన్ లో పుష్ప హిందీ కలెక్షన్లు 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే ఈ సినిమా నేపాల్ లోని థియేటర్లలో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్లను సాధిస్తోందని తెలుస్తోంది. నేపాల్ లోని కొన్ని థియేటర్లలో పుష్ప మూవీ హిందీ వెర్షన్ విడుదలైంది.

నేపాల్ సినీ అభిమానులు పుష్ప ది రైజ్ లో బన్నీ యాక్టింగ్ కు ఫిదా అయ్యారని బోగట్టా. యూట్యూబ్ లో ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సైతం ఛక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును సంపాదించుకుంటూ ఉండటంతో ఆయా స్టార్ హీరోల అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. బన్నీ భవిష్యత్తు సినిమాలు సైతం పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ కానున్నాయి. బన్నీ తన సినిమాలపై అంచనాలు పెరిగేలా ప్రమోషన్స్ చేస్తూ ఇతర ఇండస్ట్రీలలో సత్తా చాటుతున్నారు.

బన్నీ నటిస్తున్న పుష్ప ది రూల్ ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజయ్యే ఛాన్స్ ఉంది. పుష్ప ది రైజ్ సక్సెస్ ను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు సుకుమార్ పుష్ప ది రూల్ స్క్రిప్ట్ లో కీలక మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ నటులు కూడా పుష్ప ది రూల్ లో నటిస్తున్నారని సమాచారం.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus