Vakeel Saab: బయ్యర్లకు షాకిస్తోన్న పవన్ సినిమా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో పవన్ సినిమాలకు ఏవరేజ్ టాక్ వచ్చినా.. మిలియన్ డాలర్ల కలెక్షన్స్ వచ్చేస్తుంటాయి. ‘అజ్ఞాతవాసి’ లాంటి డిజాస్టర్ సినిమా కేవలం ప్రీమియర్ షోలతోనే అమెరికాలో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది. పవన్ సినిమాకి హిట్ టాక్ వస్తే 3 మిలియన్ డాలర్లు అవలీలగా వస్తుంటాయి. అయితే కరోనా కారణంగా యూఎస్ మార్కెట్ బాగా దెబ్బతింది. కానీ ‘జాతిరత్నాలు’ సినిమాతో అక్కడ మార్కెట్ పుంజుకుంది.

చిన్న సినిమా అయినప్పటికీ ఊహించని విధంగా ‘జాతిరత్నాలు’ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది. దీంతో యూఎస్ లో తెలుగు సినిమాల మార్కెట్ ఊపందుకుందని అనుకున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమాకి మంచి టాక్ వస్తే 1.5 మిలియన్ డాలర్లు ఈజీగా వసూలు చేస్తుందని భావించారు. ఈ క్రమంలో ఈ సినిమాను మంచి రేటు పెట్టి కొన్నారు బయ్యర్లు. 1.3 మిలియన్ డాలర్లు సాధిస్తే అక్కడ ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ సాధించినట్లే. ఇదేమంత పెద్ద విషయం కాదనుకున్నారు.

కానీ ప్రీమియర్ షోలతో మూడు లక్షల డాలర్లు వసూలు చేసిన ‘వకీల్ సాబ్’ ఆ తరువాత జోరు చూపించలేకపోయింది. వీకెండ్ నాటికి హాఫ్ మిలియన్ క్లబ్ లో అడుగుపెట్టిన ‘వకీల్ సాబ్’.. సోమవారానికి ఆరు లక్షల మార్క్ ను టచ్ చేసింది. ఈ సినిమాకి మంచి టాక్ వచ్చినప్పటికీ.. యూఎస్ ప్రేక్షకులు సినిమాను చూడడానికి థియేటర్ కు రావడం లేదని తెలుస్తోంది. కరోనా భయం కారణంగానో లేక రీమేక్ అనో కానీ ఈ సినిమాకి ఆశించిన వసూళ్లు రావడం లేదు. సినిమా కలెక్షన్స్ పుంజుకోకపోతే గనుక బయ్యర్లకు నష్టాలు తప్పేలా లేవు!

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus