రామ్ గోపాల్ వర్మకి ఉన్న పబ్లిసిటీ పిచ్చి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఆయన దర్శకత్వంలో రూపొందిన సినిమా కనుక రిలీజ్ అవుతుంది అంటే.. దాని కోసం చేసే పబ్లిసిటీ స్టంట్లు హాట్ టాపిక్ అవుతుంటాయి. ఫైనల్ గా సినిమాలో అంత కంటెంట్ ఏమీ ఉండదు. ఈ మధ్యనే ‘డేంజరస్’ అనే లెస్బియన్ సినిమాని నామ మాత్రంగా రిలీజ్ చేశాడు. ఆ సినిమా రిలీజ్ అయినట్టు కూడా చాలా మందికి తెలీదు.
కానీ అషురెడ్డితో చేసిన ఇంటర్వ్యూ వల్ల ఈ సినిమా గురించి కొంత చర్చ జరిగింది. అది కూడా రాంగోపాల్ వర్మని తిట్టుకుంటూనే..! సరే ఇక అసలు విషయాన్ని పక్కన పెట్టేస్తే.. అదే ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ.. అషురెడ్డి కాలు నాకడం పై విమర్శలు వెల్లువెత్తాయి. ’30 ఏళ్ళ క్రితమే పాన్ ఇండియా డైరెక్టర్ అనిపించుకున్న రాంగోపాల్ వర్మ… ఇలా చేయడం ఏంటి?’ అంటూ ఆర్జీవీ అభిమానులు కూడా అతన్ని ట్రోల్ చేస్తున్నారు.
అది అలా ఉంటే.. తాజాగా స్టేజి అనే మరో అమ్మాయితో వర్మ ఓ ఇంటర్వ్యూ చేశాడు. ఈవిడ ఇటీవల వర్మని హగ్ చేసుకుని ’10 రోజుల వరకు స్నానం చెయ్యను’ అంది. అంతే వర్మ ఇంప్రెస్ అయిపోయి ఈమెకు బ్రేక్ ఇచ్చే పనిలో పడ్డాడు. ఆ స్టేజి అనే అమ్మాయి తొడలు, కాళ్ళు చూపిస్తూ వర్మ ఆ ఇంటర్వ్యూని పోస్ట్ చేశాడు. అయితే దీని గురించి జనాలు పట్టించుకోవడం లేదు.
కానీ వర్మ శిష్యుడు అయిన ఓ దర్శకుడు ఈ ఇంటర్వ్యూ పై స్పందించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతనే బి.వి.ఎస్.రవి. ‘ఇదే ఇంటర్వ్యూ 100 ఏళ్ళ క్రితం వస్తే రాళ్లతో కొట్టి చంపేసేవారు. యాభై ఏళ్ల క్రితం వస్తే వెలి వేసేవారు. ఇప్పుడు దాదాపుగా సమాజం బరితెగించడం వల్ల మీరు బ్రతికిపోయారు’’ అంటూ వర్మను ట్యాగ్ చేశాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం రవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇదే ఇంటర్వ్యూ వంద ఏళ్ళ క్రితం వస్తే రాళ్లతో కొట్టి చంపేసేవారు. ఏభై ఏళ్ల క్రితం వెలి వేసేవారు. ఇప్పుడు దాదాపుగా సమాజం బరి తెగించడం వల్ల మీరు బతికిపోయారు @RGVzoominhttps://t.co/9ylSDJY5qd