Bigg Boss 7 Telugu: అసలు కేక్ పైన ఏముందంటే..!

బిగ్ బాస్ హౌస్ లోకి మరోసారి కేక్ ని పంపించి ఫన్ క్రియేట్ చేశాడు బిగ్ బాస్. సీజన్ 5 లో కేక్ పంపించినపుడు ఈ కేక్ తినే అర్హత ఎవరికి ఉంది ? అంటూ క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. ఇప్పుడు తేజకి స్పెషల్ గా పేరు మెన్షన్ చేసి కేక్ ని పంపించాడు బిగ్ బాస్. ఈ కేక్ పైన తేజ ఇది ముగింపు కాదు. In front There is a Crocodile Festival – ఏంటి అర్దమయిందా ? ముందుంది ముసళ్ల పండగ అని రాసి ఉంది.

ఇక్కడే అందరూ చేరి గొడవ చేశారు. అమర్ అయితే నేను తినేస్తానంటూ మాట్లాడాడు. దీంతో తేజ కేక్ పైన ఉన్నమీత తీసి తినేయండి నాకు సంబంధం లేదు అనేసరికి అక్కడ కేక్ పైన ఉన్న ఒక చాకో పీస్ ని తీస్కుని అమర్ తిన్నాడు. ఇక తేజ అయితే మీరు తింటే నాకు సంబంధం లేదు మీ ఇష్టం అంటూ రచ్చ చేశాడు. నేను ఎప్పుడైనా తింటాను ఈరోజు తింటా, లేదా రేపు తింటా, లేదంటే రేపు రాత్రికి తింటా నా ఇష్టం అంటూ తేజ అందరికీ చెప్పాడు.

కానీ, అందరూ వినిపించుకునే స్టేజ్ లో లేరు. అంతకుముందు స్పేస్ షిప్ కి చార్జింగ్ చేసే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో గౌతమ్ ఇంకా పల్లవి ప్రశాంత్ ఇద్దరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ టాస్క్ లో గౌతమ్ విన్ అయ్యాడు. అలాగే, అంతకుముందు జరిగిన టాస్క్ లో జిలేబీ పురం వాళ్లు టాస్క్ లో విజయం సాధించారు. ఫైనల్ గా కెప్టెన్సీ కంటెండర్స్ గా జిలేబీ పురం వాళ్లు నిలిచినట్లుగా తెలుస్తోంది.

దీంతో జిలేబీ పురం 2 పాయింట్స్ తో లీడ్ లో ఉంది. ఇక ఈవారం మొత్తం ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారు. వాళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. పార్టిసిపేట్ చేసిన వాళ్లలో నామినేషన్స్ లో ఉన్న వాళ్లు కూడా ఉన్నారు. మరీ వాళ్లలో ఈవారం (Bigg Boss 7 Telugu) ఎవరు సేఫ్ జోన్ లో ఉంటారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus