భరత్ అను నేను చిత్ర బృందంలోకి కొత్త టెక్నీషియన్!

సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో  చేస్తున్న “భరత్ అనే నేను” సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. కొత్త షెడ్యూల్  తమిళనాడులోని కారైకుడిలో జరుగుతోంది. అక్కడ ఒక ఫైట్ తో పాటు కొన్ని సీన్స్ తెరకెక్కించనున్నారు. ఈ టీమ్ లోకి కొత్త టెక్నీషియన్ జాయిన్ అయ్యారు. ఇప్పటి వరకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న రవి కె. వర్మన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో…  ఆ స్థానంలో ట్యాలెంటెడ్ కెమెరా మెన్ తిరు వచ్చి చేరారు. ఇతను కొరటాల శివ గతంలో తీసిన జనతా గ్యారేజ్ కు పని చేసారు. ఫైట్స్ ని విభిన్నంగా తెరకెక్కించడంలో తిరు టెక్నీక్స్ ఉపయోగపడ్డాయి. భరత్ అనే నేనులో హొలీ నేపథ్యంలో సాగే ఫైట్ ని తన కెమెరా కన్నుతో బంధించనున్నారు. ఇప్పటివరకు షూట్ చేసిన రవి కె వర్మన్ సినిమా నుండి బయటికి పోవడానికి అతని బిజీ షెడ్యూల్ కారణమని సమాచారం.

వాస్తవానికి ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ కి షూటింగ్ కంప్లీట్ చేసి జనవరిలో ఈ సినిమాని రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ స్పైడర్ ఫెయిల్ కావడంతో మరింత జాగ్రత్తగా ఈ మూవీని తీయాలని షెడ్యూల్స్ మార్పు చేశారు. కాబట్టి కెమెరా మెన్ మారారు. తిరు ఈ సినిమా బృందంలో జాయిన్ అవుతున్నందుకు ఆనందగా ఉందని ట్విట్టర్ లో తెలిపారు. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 27న రిలీజ్ కానుంది. ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ఇండస్ట్రీ హిట్ శ్రీమంతుడు కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి..

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus