అఖిల్ సార్థక్ టైటిల్ ని ముద్దాడే కెపాసిటీ ఉందా..?

బిగ్ బాస్ హౌస్ లో ఆఖరి రేస్ మొదలైంది. ఫైనల్ ఫైవ్ లో కప్ సీజన్ 4 టైటిల్ ని ముద్దాడేది ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టాప్ 5లోకి వచ్చిన ఒక్కొక్కొరిది ఒక్కొక్కదారి. ఆటలో అయినా టైటిల్ వేటలో అయినా అఖిల్ ది సపరేట్ రూట్ అనే చెప్పాలి. గేమ్ లో ఎప్పుడూ ఫోకస్ తో ఉంటూ తన గేమ్ ప్లాన్ ని వర్కౌట్ చేసుకుంటూ టాప్ 5 కి రీచ్ అయ్యాడు. నిజానికి బిగ్ బాస్ లోకి రావడం అఖిల్ డ్రీమ్ అని ఎప్పుడూ చెప్తూ ఉంటాడు అఖిల్.

రెండేళ్ల క్రిత‌మే ల‌వ్ ఫెయిల్ అయ్యిందని ఇప్పుడు సింగిల్ గా ఉన్నా అంటూ షో లో సోలోగా అడుగుపెట్టాడు. కట్ చేస్తే, మెహబూబ్, అండ్ సోహైల్ ఫ్రెండ్షిప్, మోనాల్ అభిమానాన్ని దక్కించుకున్నాడు. ఫస్ట్ వీక్స్ లో గంగవ్వతో ఉన్నా, తర్వాత మోనాల్ ని తనచుట్టూ తిప్పుకునేలా చేసుకున్నాడు. ఒకానొకదశలో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా దీన్ని బిగ్ బాస్ ఆడియన్స్ కి ప్రజెంట్ చేశాడు కూడా. ఇక ఇప్పుడు ఓటింగ్ లో కూడా తన సత్తాని చాటుతున్నాడు. బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు అసలు ఈ అఖిల్ సార్ధక్ అనేది ఎవరికీ తెలియదు.

అంతకుముందు పలు సీరియల్స్ లో యాక్ట్ చేసినా, హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మాన్ జాబితాలో ఉన్నా కూడా ఎక్కడా అంత గుర్తింపురాలేదు. ఎప్పుడైతే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడో అప్పుడు తెలుగువారందరికీ సుపరిచితుడు అయ్యాడు. గేమ్ ని ఆడుతూ తనదైన స్టైల్లో అద్దరగొట్టాడు. తన ఫిట్‌నెస్ తో టాస్క్ లు ఆడుతూ అందర్నీ ఆకర్షించాడు. ప్రస్తుతం అఖిల్ ఫ్యాన్స్ అలాగే కుటుంబసభ్యులు అఖిల్ కి ఓట్ వేయమంటూ క్యాంపైన్స్ మొదలుపెట్టారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ స్టేజ్ వరకూ వచ్చి ఫైనలిస్ట్ లో ఒకరిగా నిలిచిన అఖిల్ విజేతగా నిలుస్తాడా..? టైటిల్ ని ముద్దాడుతాడా లేదా అని ఇప్పుడు ఆసక్తికరం. అదీ మేటర్.

[yop_poll id=”1″]

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus