సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, నేషనల్ లెవెల్‌లో తన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శంకర్ (Shankar) , ప్రతీసారి భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. కమర్షియల్ మసాలాతో పాటు మెసేజ్‌ని అందించే ఆయన సినిమాలకు థియేటర్‌లోనే చూడాలనిపించే హై స్టాండర్డ్స్ ఉంటాయి. అయితే ఇటీవలి కాలంలో శంకర్ చేసిన కొన్ని భారీ బడ్జెట్ ప్రాజెక్టులు అలాంటి ఫీలింగ్ కలిగించలేదు. రీసెంట్‌గా విడుదలైన “గేమ్ ఛేంజర్” (Game Changer) సినిమా అనుకున్న స్థాయిలో పాజిటివ్ టాక్ ను సాధించలేకపోయింది.
భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి వసూళ్లు తక్కువగానే ఉండడంతో, శంకర్ ఇప్పుడు తక్కువ బడ్జెట్ సినిమాల వైపు దృష్టి పెట్టాల్సిందిగా చాలామంది సూచిస్తున్నారు. ఆయన్ని ఒక సరికొత్త అటెంప్ట్ చేయమని అభిమానులు కోరుతున్నారు. చిన్న బడ్జెట్‌తో కూడా తన టేకింగ్ మేజిక్‌ను చూపించి మరొక సూపర్ హిట్ ఇవ్వాలని అభిమానుల ఆశ. అయితే శంకర్ ఇప్పటివరకు అలాంటి సినిమా చేసింది లేదు.
మొదటి సినిమా నుంచి కూడా ఆయన కాన్సెప్ట్ లు ఓవర్ బడ్జెట్ అయినవే. అయితే ఒకప్పటి పరిస్థితులు వేరు. కాబట్టి ముందుగా శంకర్ 100 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ సినిమాతో ఒక హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. కథ, నటీనటుల ఎంపికలో సరైన నిర్ణయాలు తీసుకుంటే, లో బడ్జెట్ సినిమాలు కూడా మంచి లాభాలు ఇవ్వగలవు. ఇక శంకర్ ఇండియన్ 3 కూడా లైనప్ లో ఉన్న విషయం తెలిసిందే.
ఇండియన్ 2 డిజాస్టర్ అయినప్పటికీ పార్ట్ 3 ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో అద్భుతంగా ఉంటుందని ఒక హింట్ అయితే ఇచ్చారు. అయితే ఇండియన్ 3 డైరెక్ట్ గా ఓటీటీ లో రావచ్చని కూడా టాక్ వచ్చింది. ఒకవేళ శంకర్ ఇండియన్ 3లోకి ఫామ్ లోకి వస్తే ఆ తరువాత మళ్ళీ బిగ్ బడ్జెట్ సినిమాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే చిన్న బడ్జెట్ లో ఒక హిట్ కొట్టి కం బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.