Nazriya Nazim: మా జీవితంలో ఏ మార్పు రాలేదు : నజ్రియా

మొన్నామధ్య కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో.. తనకు ఉన్న అరుదైన వ్యాధి గురించి బయటపెట్టాడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) . అతను ఏడీహెచ్‌డీ అంటే అటెన్ష‌న్ డెఫిసిట్ హైప‌ర్ యాక్టివ్ డిసార్డ‌ర్ తో బాధపడుతున్నాడట.దీని వల్ల ఏ విషయంపైనా ఏకాగ్రత, ధ్యాస ఉండదు. అలాగే హైప‌ర్ యాక్టివ్, హైప‌ర్ ఫోక‌స్, ఇంప‌ల్సివిటీ ,సైకలాజికల్‌గా ఎంతో ఒత్తిడికి గురవుతారట. 41 ఏళ్ల వయసులో ఫహాద్ ఫాజిల్ కి ఈ అరుదైన వ్యాధి సోకడం అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది.

Nazriya Nazim

చిన్న వయసులో అయితే ఈ వ్యాధి .. క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందట. కానీ 40 + లో ఇక కుదరదట. అంటే ఇక జీవితాంతం ఈ వ్యాధితో అతను ఇబ్బంది పడాల్సిందే. అయితే ఫహాద్ వ్యాధి గురించి.. ఇతని భార్య, ప్రముఖ హీరోయిన్ నజ్రియా (Nazriya Nazim) ఇప్పుడు రియాక్ట్ అయ్యారు. నజ్రియా మాట్లాడుతూ..”ఫహాద్ వ్యాధి గురించి తెలుసుకుని నేను ఎక్కువ ఓపికగా ఉండడానికి ప్రయత్నాలు చేశాను.

ఫైనల్ గా ఓపిక పెంచుకున్నాను. భార్యాభర్తలు ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించుకోవడం కంటే ఒకరి లోపాలు మరొకరు అర్థం చేసుకుని.. సందర్భాన్ని బట్టి నడుచుకోవడం చాలా ముఖ్యం. మా జీవితంలో ఇంతకంటే మార్పులేమీ జరగలేదు. అన్నీ అర్ధం చేసుకుని సాఫీగా జీవితాన్ని నడుపుతున్నాం. ఆనందంగా ఉన్నాము” అంటూ చెప్పుకొచ్చింది.

ఫహాద్ ఫాజిల్ తెలుగు ప్రేక్షకులకి ‘పుష్ప’ (Pushpa) ‘పుష్ప 2’ తో (Pushpa 2) బాగా దగ్గరయ్యాడు. అలాగే తమిళంలో కూడా బిజీ అయ్యాడు. మొత్తంగా పాన్ ఇండియా లెవెల్లో ఫహాద్ ఫాజిల్ క్రేజ్ పెరిగిన సంగతి తెలిసిందే.

మొత్తానికి దిల్ రాజుని బయటపడేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus