సంసారమైనా..సినిమా అయినా ఎవరో ఒకరు కాంప్రమైజ్ కావలి, లేదంటే బండి ముందుకు సాగదు. నిర్మాతల రిక్వైర్మెంట్స్ కోసం దర్శకుడు, దర్శకుడు రిక్వైర్మెంట్స్ కోసం నటులు కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. సినిమా మేకింగ్ కి కావలసిన 24 క్రాఫ్ట్స్ లో ఎంతో కొంత మంది కాంప్రమైజ్ కలసిందే. ఈ కాంప్రమైజ్ అనే కాన్సెప్ట్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోలసి వచ్చిందంటే టాలీవుడ్ లో అతి పెద్ద కాంబినేషన్ ఒకటి సెట్ అయ్యింది.
ఏళ్లుగా ఈ కాంబినేషన్ కొరకు అనేక మంది ఎదురు చూస్తుండగా తాజాగా ప్రకటన రావడం జరిగింది. అదే మహేష్-రాజమౌళి కాంబినేషన్. రాజమౌళి తాజా ఇంటర్వ్యూలో ఆర్ ఆర్ ఆర్ తరువాత తన మూవీ మహేష్ తోనే అని, దానికి కే ఎల్ నారాయణ నిర్మాత అని స్పష్టం చేశారు. అసలు మహేష్-రాజమౌళికి ఇంత వరకు మూవీ ఎందుకు సెట్ కాలేదు. దానికి ఇండస్ట్రీ వర్గాలలో వినిపించే సమాధానం మహేష్ మరియు రాజమౌళిలలో ఉండే ఇగోనే కారణం అని. సూపర్ స్టార్ నాకేమిటి అని ఫీలయ్యే మహేష్ బాబు ఏ దర్శకుడు తనతో సినిమా చేయాలని పైరవీలు చెయ్యరు.
ఇక రాజమౌళి తనకు అనుకూలంగా ఉండి, చెప్పినట్లు వినే హీరోలతోనే సినిమా చేయాలంటుకుంటాడు. అలా అని మహేష్ డైరెక్టర్స్ చెప్పింది వినడని అర్థం కాదు. సినిమాలో దర్శకుడి మాట వినే మహేష్, సినిమాల కోసం దర్శకుల దగ్గరకు వెళ్లరు. ఇక రాజమౌళిది కమాండింగ్ నేచర్… హీరో ఎవరైనా తన కంఫర్ట్ జోన్ లో పని చేయాలని కోరుకుంటాడు. తనతో సినిమా చేయాలని కోరిన హీరోలను ఆయన దృష్టిలో ఉంచుకుని ఆఫర్స్ ఇస్తారు. ఇలా రెండు విరుద్ధ స్వభావాలు కలిగిన వారు మహేష్ మరియు రాజమౌళి. మరి వీరి కాంబినేషన్ లో వచ్చే ఆ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.
Most Recommended Video
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!