అక్కడ ప్రభాస్ ని బీట్ చేసేది ఎన్టీఆరేనా.?

టాలీవుడ్ హీరోలందరూ వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. ఎన్టీఆర్, చరణ్ లు ఆర్ ఆర్ ఆర్ తో, అల్లు అర్జున్ పుష్ప మూవీతో, పవన్ కళ్యాణ్ క్రిష్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నారు. వీరందరికి ప్రభాస్ బెంచ్ మార్క్ లా ఉన్నాడు. ఎందుకంటే అయన ఇప్పటికే అక్కడ మూడు చిత్రాలు విడుదల చేశాడు. భాహుబలి, బాహుబలి 2, సాహో చిత్రాలు ఆయన హిందీలో విడుదల చేయడం జరిగింది. ఈ మూడు చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. సాహో తెలుగులో కూడా విఫలం చెంది హిందీలో హిట్ కావడం ప్రభాస్ మేనియా అక్కడ ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతుంది. దారుణమైన రేటింగ్స్ మధ్య విడుదలైన సాహో 150 కోట్లకు పైగా వసూళ్లతో సూపర్ హిట్ గా నిల్చింది.

మరి ప్రభాస్ తరువాత ఆ స్థాయి స్టార్ డమ్ ఎవరు సంపాదించనున్నారు అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మొదలైంది. ఐతే ప్రభాస్ స్థాయి పాన్ ఇండియా పాపులారిటీ ఎన్టీఆర్ సాధించే అవకాశాల ఎక్కువగా ఉన్నాయి. దానికి కారణం ఆయన మూవీ లైన్ అప్ నే. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ తోనే ఎన్టీఆర్ ఫేమ్ భారీగా పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమాకు బాలీవుడ్ లో ఉన్న డిమాండ్ రీత్యా అందరికీ రీచ్ కానుంది. రాజమౌళి సినిమా కాబట్టి ఎన్టీఆర్ ని ఆయన గొప్పగా ఆవిష్కరించి ఉంటాడు. ఇక ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీ మాటల మంత్రికుడు త్రివికం తో చేయనున్నాడు.

ఈ సినిమా సైతం భారీగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుందని సమాచారం. ఇక ఎన్టీఆర్ 31వ చిత్రం క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్నాడు. ఈ మూవీ ఎన్టీఆర్ ఇమేజ్ మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయం అంటున్నారు. అలాగే డైరెక్టర్ అట్లీ, సంజయ్ లీలా భన్సాలీ వంటి పేర్లు కూడా ఎన్టీఆర్ నెక్స్ట్ లిస్ట్ లో ఉన్నాయి. కావున ప్రభాస్ తరువాత బాలీవుడ్ లో జెండాపాతేది ఎన్టీఆర్ అంటున్నారు.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus