ఏపీ ప్రభుత్వ పోర్టల్‌ సక్రమంగా పని చేస్తేనే సుమా..!

ప్రతి చెడులోనూ మంచి ఉంటుంది అంటారు మన పెద్దలు. అలా అని చెప్పి చెడు జరగాలని కోరుకోం కానీ… ఆ చెడులోని మంచి ఏంటో తెలుసుకోవాలి కదా. ఇదంతా ఏపీ ఆన్‌లైన్‌ సినిమా టికెటింగ్‌ గురించే. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వస్తే సినిమా పరిశ్రమ మీద ప్రభుత్వ పెత్తనం పడుతుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. అవునో, కాదో అనేది సినిమా వాళ్లు, ప్రభుత్వం చూసుకోవాలి, చూసుకుంటుంది. చూసుకోకపోయినా అది వారి ఇష్టం. అయితే దీని వల్ల ప్రేక్షకులకు ఓ విధంగా మంచి జరుగుతుంది.

రిలీజ్‌ రోజు సినిమా టికెట్‌ సంపాదించడం ఎంత కష్టమో గుర్తుంది కదా. ఇప్పుడు ఓటీటీల సీజన్‌ వల్ల ఇలాంటి పరిస్థితి మనకు లేదు కానీ. ఒకప్పటి రోజులు గుర్తుంచుకోండి. థియేటర్‌ కౌంటర్‌లో పది టికెట్లు అమ్మేసి… మిగిలినవాటిని బ్లాక్‌ చేయడమో, బ్లాక్‌లో అమ్మడమో చేస్తుంటారు. చాలాసార్లు మీరు కూడా ఇలాంటి ఇష్యూ ఫేస్‌ చేసి ఉంటారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ పోర్టల్‌ సక్రమంగా పని చేస్తే… టికెట్ల అమ్మకంగా పక్కాగా ఉంటుంది. దాంతో ప్రేక్షకులకు బ్లాక్‌ టికెట్లు, బ్లాకింగ్‌ సమస్య ఉండదు.

రిలీజ్‌ అయిన తొలి రోజులు, వీకెండ్‌లో బ్లాక్‌ మార్కెట్‌ బలంగా ఉంటుంది. పోలీసులు ఎంత కష్టడినా.. కొన్ని సార్లు బ్లాక్‌ వీరులు రెచ్చిపోతుంటారు. పైరసీ నిర్మాతకు నష్టం చేస్తే… బ్లాక్‌ మార్కెట్‌ ప్రేక్షకుడికి నష్టం చేస్తుంది. పైరసీ విషయంలో నిర్మాతలు ఎంత ఆందోళన చేస్తున్నారో మనం చూశాం. కానీ ప్రేక్షకుడి బ్లాక్‌ మార్కెట్‌ కష్టం నిర్మాతలు చూడలేరు. అయితే అభిమాన హీరో సినిమా కోసం కాస్త ఎక్కువపెట్టి, కొన్ని సార్లు చాలా ఎక్కువ పెట్టి చూసేస్తుంటారు. అయితే ఇది లాసే కదా.

ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న పోర్టల్‌, విధానం పక్కాగా అమలైతే… బ్లాక్‌ మార్కెట్‌ సమస్య పూర్తిగా తొలగిపోవచ్చు. అలా థియేటర్‌ కౌంటర్లలో ప్రింట్‌ రేట్‌ కన్నా ఎక్కువ ధరకు టికెట్లు కొనే సమస్య కూడా తగ్గిపోతుంది. అయితే ఇదంతా పోర్టల్‌ సక్రమంగా పని చేస్తేనే. దానికి గౌరవమిచ్చి థియేటర్‌ యాజమాన్యాలు పక్కాగా నడుచుకుంటేనే. అయితే ఏమవుతుంది, ఎలా అవుతుంది అనేది విధానం అమల్లోకి వస్తేనే తెలుస్తుంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus