బాహుబలి రికార్డ్స్ ను టార్గెట్ చేసిన రోబో 2.0

దర్శకుడిగా రాజమౌళి తన ప్రతి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని, ఖ్యాతిని పెంపొందించడంతోపాటు తన స్టార్ డమ్ ను కూడా పెంచేసుకొన్నాడు. కెరీర్ మొత్తంలో ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేని రాజమౌళి ఇప్పుడు మోస్ట్ ఫేవరెట్ మాత్రమే కాదు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. రాజమౌళికి ముందు భాషతో సంబంధం లేకుండా అన్నీ ఇండస్ట్రీల హీరోలు, దర్శకనిర్మాతలు రెస్పెక్ట్ ఇచ్చింది శంకర్ కే. దర్శకుడిగా “భారతీయుడు, అపరిచుతుడు, రోబో” లాంటి సినిమాతో ఆయన పాన్ ఇండియా దర్శకుడిగా పేరు తెచ్చుకొన్నాడు. ఆయన సినిమాల్లో ఎంటర్ టైన్మెంట్ తోపాటు సోషల్ మెసేజ్ కూడా ఉండడం విశేషం. అందుకే ఆయన సినిమాలు అన్నీ బాషల్లోనే సూపర్ హిట్ అవుతుండేవి. అయితే.. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన “స్నేహితుడు, ఐ” లాంటి సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో మార్కెట్ పరంగా ఆయన రేంజ్ కొంచెం తగ్గింది.

దాంతో అప్పుడే “బాహుబలి” సిరీస్ తో ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్స్ అందుకొన్న రాజమౌళి దర్శకుడిగా అగ్ర స్థానాన్ని కైవసం చేసుకొన్నాడు. అయితే.. మళ్ళీ శంకర్ “2.0”తో దర్శకుడిగా తన స్టామినాను కాస్త ఘనంగా చాటుకొనేందుకు సన్నద్ధమవుతున్నాడు. రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. అయితే.. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, చైనీస్, జపనీస్ భాషల్లో ఏకకాలంలో విడుదలకానున్న ఈ చిత్రం “బాహుబలి” రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందో లేదోననే అనుమానాలు మొదలయ్యాయి. రజనీకాంత్ & శంకర్ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ కి ఆ రికార్డ్స్ ను బ్రేక్ చేయడం పెద్ద కష్టమేమీ కాకపోయినా.. అందరికీ ఎక్కడో డౌట్ కొడుతుంది. మరి రిజల్ట్ ఏమిటనేది నవంబర్ 29న క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి. అప్పటివరకూ వెయిట్ చేయడం తప్ప ఏం చేయగలం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus