వరుణ్ కు మళ్ళీ తెలంగాణ యాస కలిసొస్తుందా?

వరుణ్ తేజ్.. ‘ముకుంద’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. మొదటి హిట్టందుకోవడానికి ఐదవ సినిమా వరకూ టైం పట్టింది. అవును వరుణ్ కు మొదటి హిట్టిచ్చిన చిత్రం ‘ఫిదా’. ఈ చిత్రంలో హీరోయిన్ మాట్లాడే తెలంగాణ యాస సినిమాకే హైలెట్ అని చెప్పాలి. ఇక అదే చిత్రంలో వరుణ్ కూడా అప్పుడప్పుడు తెలంగాణ యాస మాట్లాడి అలరించాడు. ఇక ఆ చిత్రం తర్వాత వరుణ్ కు దక్కిన మరో బ్లాక్ బస్టర్ ‘ఎఫ్2’. ఈ చిత్రంలో బోరబండ వరుణ్ యాదవ్ పాత్రలో వరుణ్ తేజ్ తెలంగాణ స్లాంగ్ తో రెచ్చిపోయాడు. 2019 పెద్ద హిట్ చిత్రాలలో ‘ఎఫ్2’ కూడా ఒకటి.

ఇదిలా ఉండగా ఇప్పుడు.. ‘వాల్మీకి’ చిత్రంలో కూడా గద్దల కొండ గణేష్ గా భయపెడుతున్నాడు. ఇక ఈ చిత్రంలో కూడా వరుణ్ తెలంగాణ యాసతో అదరకొట్టినట్టు ‘వాల్మీకి’ ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. వరుణ్ కాస్త నెగిటివ్ రోల్ లో కనిపిస్తున్నప్పటికీ నటనలో మాత్రం మరో మెట్టు పైకి ఎక్కేసాడని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన టీజర్,ట్రైలర్ అలాగే పాటలకి కూడా మంచి మార్కులు పడ్డాయి. దీంతో సినిమా పై మరింత అంచనాలు పెరిగాయి. ఇక వరుణ్ కి మరోసారి తెలంగాణ సక్సెస్ ఫార్ములా వర్కౌట్ అవుతుందో లేదో సెప్టెంబర్ 20 న తెలుస్తుంది.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus