7 రోజుల్లో మామ టార్గెట్ రీచ్ అవ్వగలడా..!

విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘వెంకీమామ’. 2016లో వచ్చిన ‘ప్రేమమ్’ సినిమాలో మామా అల్లుళ్ళు కాసేపు కనిపించి థియేటర్లలో రచ్చ చేయించారు. ఫుల్ లెంగ్త్ లో వీళ్ళిద్దరిని ఎప్పుడు స్క్రీన్ పై చూస్తామా అని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ‘పవర్’ ఫేమ్ బాబీ వచ్చి ‘వెంకీమామ’ ను తెరకెక్కించడానికి వచ్చాడు. రిలీజ్ డేట్ విషయంలో ఇప్పటి వరకూ టెన్షన్ పెడుతూ వచ్చిన నిర్మాతలు ఎట్టకేలకు డిసెంబర్ 13 న వెంకటేష్ పుట్టినరోజున.. ‘వెంకీమామ’ ను విడుదల చేయడానికి డిసైడ్ అయినట్టు టాక్ బలంగా వినిపిస్తుంది.

Yennallako Retro Song From Venky Mama will be out tomorrow

త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. ‘వెంకీమామ’ చిత్రానికి 45 కోట్ల వరకూ బడ్జెట్ పెట్టారని తెలుస్తుంది. సో వారం రోజుల్లోనే పెట్టిన మొత్తం రాబట్టాల్సి ఉంది. మళ్ళీ వారం అంటే డిసెంబర్ 20న దాటాక.. బాలయ్య ‘రూలర్’, సాయి తేజ్ ల ‘ప్రతీరోజూ పండగే’ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలకు కూడా ఎక్కువ థియేటర్స్ కేటాయించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మామ టార్గెట్ ఛేజ్ చేయగలడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus