సినిమాని అడ్డం పెట్టుకుని జ్యోతిక పై కక్ష సాధిస్తున్నారా?

  • July 17, 2019 / 04:37 PM IST

ప్రముఖ సినీ నటి జ్యోతిక పై ఇటీవల పోలీస్ కేసు ఫైల్ అయ్యింది. ‘ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల పని తీరు బాగోలేదని అందుకే.. విద్యార్థులు సరిగ్గా రాణించలేకపోతున్నారని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే’. ఇందుకోసమే ఆమె కేసు నమోదైంది అని అందరూ అనుకున్నారు. కానీ అసలు విషయం ఇంకా ఉంది. ప్రభుత్వ పాఠశాలల సంఘం తరఫున చెన్నై పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో ఆమె పై కేసు నమోదయ్యింది. కాస్త విషయాన్ని లోతుగా పరిశీలిస్తే.. నటి జ్యోతిక ‘రాక్షసి’ అనే చిత్రంలో నటించింది.

తాజాగా విడుదలైన ఈ చిత్రంలో జ్యోతిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి పాత్రలోనటించింది. ఇక ఈ చిత్రంలో టీచర్లు పిల్లలకు క్లాసులు సరిగ్గా చెప్పకుండా.. కథల పుస్తకాలు చదువుకుంటున్నట్లు, సెల్ ఫోన్ తో ఆడుకుంటున్నట్లు చూపించారు. గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్లు అధిక జీతాలు తీసుకుంటూ కూడా విద్యార్థులను సరిగ్గా పట్టించుకోవట్లేదని.. అందువల్లే వారు మెడికల్ వంటి ఉన్నత విద్యల్లో రాణించలేకపోతున్నట్టు కూడా సినిమాలో చూపించారు. నిజాయితీగా పని చేసే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యులను కించపరిచే విధంగా ఈ సినిమాలో కొన్ని సీన్లు ఉన్నాయని విమర్శలు తలెత్తుతున్నాయి. దీంతో తమిళనాడు ఉపాధ్యుల సంఘం రాష్ట్రం అధ్యక్షుడు పీకే.ఇళమారన్ ఇటీవల చెన్నై పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో ‘రాక్షసి’ పై కంప్లైంట్ ఇచ్చారు. ‘రాక్షసి’ సినిమాలో ఉపాధ్యాయుల వల్లే దేశం నాశనమవుతుందన్నట్లు కొన్ని డైలాగ్స్, సన్నివేశాలు చోటు చేసుకున్నాయని కూడా అందులో పేర్కొన్నారు. ఇది ఉపాధ్యాయులందరినీ కించపరిచే విధంగా ఉందని. కాబట్టి ఈ సినిమాని నిషేధించాలని… నటి జ్యోతిక తో పాటు చిత్రబృందం పై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. ‘సినిమాని అడ్డం పెట్టుకుంటున్నారు గాని.. జ్యోతిక మాట్లాడిన తీరుకే వీరు ఇలా సినిమాని ఆటంకపరుస్తున్నారని’ కోలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus