ఆ యాంకర్ అన్నంత పనీ చేసిందే..!

‘బిగ్ బాస్ 3’ జూలై 21 నుండీ మొదలుకానుంది. ఈ సీజన్ ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్నాడు. మొదటి సీజన్ ను జూ.ఎన్టీఆర్, రెండవ సీజన్ ను నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేసి సూపర్ హిట్ చేశారు. ఇప్పుడు నాగార్జున ఎలా హోస్ట్ చేస్తారా అనేది… అందరిలోనూ ఆసక్తిని పెంచుతుంది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ లో అసభ్యకర కార్యకలాపాలు జరుగుతున్నాయని… ఉత్తరాది సంస్కృతిని తెలుగు ప్రేక్షకులపై రుద్దుతున్నారని మాజీ యాంకర్ శ్వేతా రెడ్డి జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు. అయితే, అది బంజారా హిల్స్ పరిధిలోకి వస్తుందని అక్కడి… వారు చెప్పడంతో ఆమె బంజారాహిల్స్‌కు వెళ్ళిందట.

శ్వేతా రెడ్డి కంప్లైంట్ ద్వారా పేర్కొంటూ.. ” ‘బిగ్ బాస్‌’ లో క్యాస్టింగ్ కౌచ్‌ ఉంది. ‘బిగ్ బాస్ 3’ అడిషన్స్‌లో సెలక్టయిన నన్ను ఓ నిర్మాత ‘బిగ్ బాస్‌ను కన్విన్స్ చేస్తే.. షోలోకి ఎంట్రీ ఇస్తాం’ అంటూ మాట్లాడాడు. సెలక్షన్స్ కోసం వచ్చిన వారిని కమిట్‌మెంట్ ఇస్తారా?, ‘బాస్‌ని ఎప్పుడు సంతృప్తి పరుస్తారు? మీరు బాడీ ఎప్పుడు తగ్గించుకుంటారు. వర్కవుట్స్ ఎప్పటి నుండీ మొదలు పెడతారు?’ అని అడిగారు. బిగ్ బాస్ అనేది గేమ్ షో. అందులో బాడీ షేప్‌కి సంబంధం ఏంటి? శ్యామ్ అనే నిర్మాత నాతో అసభ్యంగా మాట్లాడాడు’ అంటూ తెలియజేసింది. ప్రస్తుతం ఈమె ఇలా కంప్లైంట్ ఇవ్వడం పెద్ద దుమారాన్నే రేపాయి. ముందు నుండీ ఈమె ‘బిగ్ బాస్’ హౌస్ పై కామెంట్స్ చేస్తూనే వుంది. ‘మహిళలందరినీ కూడా గట్టుకుని ఈ ‘బిగ్ బాస్’ కార్యక్రమం పై పోరాడతానని’ ఇదివరకే చెప్పింది. ఇప్పుడు ఈ కంప్లైంట్ తో ఆమె అన్నంత పనీ చేసిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం పై ‘బిగ్ బాస్’ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus