దివంగత దాసరి నారాయణరావు రావు గారి కొడుకులు ఈ మధ్య కాలంలో ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న దాసరి నారాయణ రావు గారి సన్నిహితులు ఒకరు వీళ్ళ పై బ్లాక్ మెయిలింగ్ కేసు పెట్టాడు. ‘చేసిన అప్పు తీర్చమని ఇంటికి వెళ్లి అడిగితే.. ‘ఇంకోసారి డబ్బు కోసం ఇంటికి వస్తే చంపేస్తాం’ అని బెదిరించారు’ అంటూ అతను కేసు పెట్టాడు. అది ఇంకా అలా ఉండగానే..
ఇప్పుడు దాసరి చిన్న కొడుకు అరుణ్ కుమార్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద మరో కేసు నమోదవ్వడం సంచలనంగా మారింది. ఇది కూడా దాసరి గారు చేసిన అప్పు విషయం కారణంగానే అని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..బొల్లారం లోని మారుతినగర్ కు చెందిన నర్సింహులు (41) అనే వ్యక్తి …. దాసరి గారి సినిమాలకు 2012 నుండీ 2016 వరకూ రిస్టోరేషన్ పనులను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో చేశాడు. అయితే దాసరి నారాయణరావు గారు మరణించిన టైములో ఈయనకి కొంత బాకీ చెల్లించాల్సి ఉంది. వాటిని ఆ టైంకి క్లియర్ చేయలేదు.
ఈ కారణంగానే నర్సింహులకు… దాసరి నారాయణరావు గారి కొడుకులు ప్రభు, అరుణ్ కుమార్ ల మధ్య గొడవలు ఏర్పడ్డాయి. ఈ విషయం పై రెగ్యులర్ గా ఆయన్ని అరుణ్ ని సంప్రదిస్తూనే ఉన్నారట. ఈ క్రమంలో ప్రభు ఈనెల 13 న ఫిలింనగర్‌లోని ఎఫ్‌ఎన్‌సీసీ వద్దకు నర్సింహులను పిలిచాడట. అతని స్నేహితులు శ్రీనివాస్, చంటి ని వెంటబెట్టుకుని ఆయన అక్కడకు వెళ్లాడు. ఆ సమావేశంలో దాసరి అరుణ్ కుమార్.. నర్సింహులుని కులం పేరుతో దూషించాడట. అందుకే అరుణ్ పై కేసు నమోదైనట్టు స్పష్టమవుతుంది.