హన్సికకు ‘మహా’ కష్టం వచ్చింది!

యూ.ఆర్.జ‌మీల్ ద‌ర్శ‌క‌త్వంలో హన్సిక 50వ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మ‌హా’. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ గా ఒక పోస్టర్ ను ఇటీవలే విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే ఈ పోస్టర్ లో కాషాయ వస్త్రాలు ధరించుకుని ఉన్న హన్సిక ఒక సింహాసనం లాంటి కుర్చీలో కూర్చుని .. హుక్కా తాగుతూ ఉంటుంది.

ఇప్పుడు ఈ పోస్టర్ పై పెద్ద దుమారమే లేచింది. ఈ పోస్టర్ హిందువుల మనోభావాలు కించపరిచేలా ఉందని పీఎంకే పార్టీ వారు కోర్ట్ లో కేసు వేశారు. ఈ కేసును కోర్టు విచారణకు స్వీకరించటంతో సినిమా పరిస్థితి ఏమవుతుందో అనే ఆందోళనలో ఉన్నారు చిత్ర యూనిట్ సభ్యులు. అయితే ఈ వివాదంతో హన్సిక ‘మహా’ చిత్రం ఎనలేని క్రేజ్ ను సంపాదించుకుంది. మరి ఈ క్రేజ్ సినిమాకు ఎంతవరకూ ఉపయోగపడుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus