Tollywood: టాలీవుడ్ మళ్లీ కాస్టింగ్ కౌచ్ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?
- April 4, 2026 / 11:59 AM ISTByFilmy Focus Desk
మొన్నీమధ్యే మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ అనేదే లేదు. తెలుగు సినిమా పరిశ్రమలో సురక్షితం అని చెబితే కొంతమంది రియాక్ట్ అయ్యారు. పరిశ్రమలో చాలా ఇబ్బందులు ఉన్నాయని, మహిళలు కాస్టింగ్ కౌచ్ కారణంగా ఇబ్బంది పడుతున్నారు అని కూడా వివరించారు. అప్పుడే కాదు అంతకుముందు కూడా చాలామంది మహిళలు ఈ మాట అన్నారు. కొన్ని కేసుల వరకు కూడా వెళ్లాయి. మలయాళ సినిమా పరిశ్రమ అంత లేకపోయినా ఇక్కడ కూడా అవేర్‌నెస్ ఉంది. ఎందుకంటే అంటే అక్కడ కేసులు, అరెస్టులు అవుతున్నాయి.
Tollywood
ఇక ఇప్పుడు లేటెస్ట్ టాపిక్ విషయానికొస్తే.. అమెరికాలో ఉంటున్న తెలుగు అమ్మాయి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ పికు నెమలి అలియాస్ ప్రియాంక నెమలికంటి ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ వీడియో షేర్ చేసింది. ‘తెలుగు సినిమా పరిశ్రమ అనుభవం’ అని రాస్తూ తెలుగు సినిమాల్లోకి రావాలి అనుకుంటున్న తనకు టాలీవుడ్‌లో ఎదురైన తొలి పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది. తాను తెలిసినవారి దగ్గరి నుండి తెలుసుకొని తన ప్రొఫైల్‌ను ఓ వ్యక్తికి పంపించానని చెప్పింది. ఆ తర్వాత అతను ఏం చేశాడో వివరించింది.
సినిమాల్లోకి రావాలని అనుకుంటున్నానని ఆమె చెబితే.. కమిట్‌మెంట్ ఇస్తారా అని అడిగారట. తొలుత తాను పని విషయంలో అనుకున్నానని, కానీ నిర్మాత రెడీగా ఉన్నారు రిసార్ట్‌లో కలుద్దాం అని అనేసరికి అప్పుడు అసలు విషయం అర్థమై ఆ వ్యక్తి నెంబర్‌ను బ్లాక్ చేశానని ప్రియాంక నెమలికంటి చెప్పింది. దీంతో టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ చర్చ మళ్లీ మొదలైంది. ఈ క్రమంలో టాలీవుడ్ లోని ‘వాయిస్ ఆఫ్ ఉమెన్’ గ్రూప్, లైంగిక వేధింపుల నిరోధక ప్యానెల్ సభ్యురాలు, నటి ఝాన్సీ స్పందించారు. ప్రియాంకకు నేరుగా మెసేజ్ చేసి, బాధ్యులపై ఫార్మల్‌గా ఫిర్యాదు చేయాలని కోరారు.
కాస్టింగ్ కౌచ్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం, పరిస్థితులు మారడం లాంటి కారణాల వల్ల ఇప్పుడు ప్రియాంక నెమలికంటి విషయంలో త్వరగా తేలేలా ఉంది.












