మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి…ఇలా వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసారు టాలీవుడ్ కింగ్ నాగార్జున. ఊపిరి సినిమా రిలీజైన మూడవ వారంలో కూడా రికార్డు స్ధాయి కలెక్షన్స్ తో విజయవంతంగా ప్రదర్శింపబడుతుండడం విశేషం. నాగార్జున కెరీర్ లో ఆల్ టైమ్ హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచి సరికొత్త రికార్డు సాధించింది. ఊపిరి చిత్రానికి ఇంతటి సంచలన విజయాన్ని అందించిన సందర్భంగా హైదరాబాద్ శిల్ప కళావేదికలో చిత్రయూనిట్ అక్కినేని అభిమానుల సమక్షంలో థాంక్యూ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన …..
దర్శకరత్న దాసరి మాట్లాడుతూ… నేను పదిహేను సంవత్సరాల క్రితం బొమ్మరిల్లు సినిమా చూసాను. ఆతర్వాత నేను ఇంత వరకు ఒక గొప్ప సినిమాని చూసుంటే అది కేవలం ఊపిరి. తెలుగు వాళ్లు మంచి సినిమాలు చేయడం లేదు. మనం హిందీ, మలయాళ చిత్రాలతో పోటీపడి మంచి సినిమాలు చేయడం లేదు అని బాధపడేవాడిని. అలా బాధ పడుతున్న టైంలో నిజంగా ఆ బాధ మరిచిపోయేలా తెలుగువాడు కూడా గొప్ప సినిమా తీయగలడు అని నిరూపించింది ఊపిరి సినిమా. గట్స్ తో ఊపిరి సినిమా తీసిన పి.వి.పి ని మనసారా అభినందిస్తున్నాను. ఇదే నాగార్జున, కార్తీ, తమన్నా లతో కమర్షియల్ సినిమా తీయచ్చు. కానీ ఓ మంచి సినిమా తీయాలని ఈ సినిమా తీసారు. నాగార్జున కళ్లు నాకు చాలా ఇష్టం. మజ్ను క్లైమాక్స్ లో నాగార్జున కళ్ల పై ఓ సీన్ తీసాను. నాగార్జున కళ్లును ఎవరు వాడుకోలేదు. వంశీ బాగా వాడుకున్నాడు మొత్తం సినిమా అంతా వాడుకున్నాడు. కళ్లతో నటించడం అంటే నటనలో పరిణితి వచ్చిన వాళ్లే చేయగలరు. నేను కనుక అవార్డు కమిటీలో ఉంటే నాగార్జునకి బెస్ట్ ఏక్టర్ అవార్డ్ ఇచ్చేస్తాను. మనం సినిమాని అన్నపూర్ణ సంస్థ తప్ప వేరే వాళ్లు తీసేవారు కాదు. ఒకవేళ తీసినా ఆడేది కాదు. అలాగే అన్నమయ్య సినిమా చేయడానికి మిగిలిన హీరోలు ఒప్పకోరు. నాగేశ్వరరావు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అదే స్పూర్తి నాగార్జునలో కనిపిస్తుంది. ఈ సినిమాకి నిజమైన హీరో దర్శకుడు. ప్రతి సీన్ ప్రతి క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. కార్తీ తప్ప ఎవరు చేసినా ఆ పాత్ర అంత ఇన్నోషెంట్ గా ఉండేది కాదు. 15 ఏళ్లలో నేను చూసిన గొప్ప సినిమా ఊపిరి. ఈ సినిమా యూనిట్ ను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అన్నారు.
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ…నాకు నాగ చైతన్య సినిమా టైటిల్ సాహసం శ్వాసగా సాగిపో టైటిల్ నాకు బాగా ఇష్టం. అలా సాహసంతో చేస్తేనే గీతాంజలి, శివ, నిన్నే పెళ్లాడతా, అన్నమయ్య, మన్మధుడు …ఇలా ఎన్నో కొత్త కొత్త ప్రయోగాలు చేసాను. సాహసం నేనయితే శ్వాస మీరు ( అభిమానులు). అభిమానుల అండ లేకపోతే నేను ఇలాంటి సినిమాలు చేయగలిగే వాడినే కాదు. ఎప్పటి నుంచో నన్ను ఎంతగానో అభిమానిస్తున్న అందరికీ పాదాభివందనాలు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో తెలియదు. ఇలాంటి విభిన్నమైన సినిమాలు చేస్తూ మిమ్మిల్ని ఆనందింప చేస్తాను. ఇదే సాహసంతో తిరుపతిలో హతిరామ్ బాబా మీద కొత్త సినిమా చేస్తున్నాను. అంతే కాకుండా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య సినిమా ప్రారంభించాలి. అఖిల్, వంశీ కలిసి చేసే సినిమా కథ ఫైనల్ చేయాలి. ఈ రెండు నెలల్లో నేను చేసే పని ఇది. చైతన్య, అఖిల్ సినిమాల విషయంలో ఇంతకు ముందు మనసు పెట్టలేదు. ఈ సంవత్సరం అదే పనిలో ఉంటాను. ఒక ఏక్టర్ కి డైరెక్టర్ కి కావాల్సింది గొప్ప ప్రొడ్యూసర్. అలాంటి గొప్ప ప్రొడ్యూసర్ పివిపి నాకు దొరకడం హ్యాఫీగా ఉంది. తెలుగు ప్రేక్షకులు అందరికీ థ్యాంక్స్ అన్నారు.
నిర్మాత పివిపి మాట్లాడుతూ…సినిమాకి ఊపిరి ప్రేక్షకులు. ఒక మిషన్ గా వర్క్ చేసాం. మీ సపోర్ట్ ఇలాగే కావాలి అన్నారు.
డైరక్టర్ వంశీ మాట్లాడుతూ… ఊపిరి తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అంతా స్పెషల్ గా కనిపిస్తున్నారు. నామీద నమ్మకంతో నాతో మూడు సినిమాలు నిర్మించిన నిర్మాత దిల్ రాజు గారికి థ్యాంక్స్ నా ఫస్ట్ ససినిమా హీరో ప్రభాస్ , బృందావనం హీరో ఎన్టీఆర్, ఎవడు సినిమా అవకాశం ఇచ్చిన చిరంజీవి గార్కి,చరణ్, బన్నికి థ్యాంక్స్ . వీళ్లందరికీ ఎంత చెప్పినా తక్కువే. వీళ్లందరూ ఒక ఎత్తైతే నాగార్జున గారు మరో ఎత్తు. ఈ సినిమా కోసం నాగార్జున గార్ని కలసినరోజున నాలో ఉన్న భయాన్ని నమ్మకంగా మార్చి పంపించారు. నాగార్జున గారు ఈ సినిమా చేసిన ప్రతి ఒక్కరికి జీవితం ఇచ్చారు. వీల్ ఛైర్ లో నాగార్జున గార్ని ఎలా కూర్చోబెడతారు అని చాలా మంది అడిగారు. కానీ నాగ్ సార్ మమ్మల్ని ముందుకు నడిపించారు. కార్తీకి ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కేవే. ఊపిరి సినిమాకి నాగార్జున గారు ఓ ఊపిరి అయితే ఇంకో ఊపిరి పివి అన్న. కంటెంట్ నమ్మి అవకాశాన్ని ఇచ్చిన మీకు పాదాభివందనాలు. రచయిత హరి లేకపోతే ఏ అడుగు వేయలేను. హరిని నేను అన్నయ్యగా భావిస్తాను . హరి నా లైఫ్ లోకి వచ్చారు జీవితం బ్యూటీఫుల్ గా మారింది. మంచి సినిమా తీస్తే ఇంతగా అభినందిస్తారా అని తెలిసింది అన్నారు.
హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ… ఇప్పటి వరకు కొన్ని మంచి సినిమాలు చేసాను. కానీ ఆ సినిమా రిలీజ్ తర్వాత సక్సెస్ ఎంజాయ్ చేయలేదు. మంచి సినిమాలో నటించిన తర్వాత ఆ సక్సెస్ ని ఆడియోన్స్ తో కలసి ఎంజాయ్ చేయడం బాగుంది. ఊపిరి అనే గొప్ప సినిమాలో నటించడంతో ఈ టీమ్ నాకు చాలా స్పెషల్. కార్తీతో కలిసి నటించిన మూడవ సినిమా ఇది. ఈ మూడు సినిమాలు సక్సెస్ అయినందుకు కార్తీ నా లక్కీ హీరో అనుకుంటున్నాను. నాగ్ సార్ స్వీటెస్ట్ పర్సన్ . నాగ్ సార్ తో వర్క్ చేసే అవకాశం రావడం నా అదృష్టం అన్నారు.
ఈ కార్యక్రమంలో సుశాంత్, సీతారామశాస్త్రి, కోనవెంకట్, ఎ.నాగసుశీల, అబ్బూరి రవి, కళ్యాణ్ కృష్ణ, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.