రంగస్థలం చిత్ర యూనిట్ ని అభినందించిన టాలీవుడ్ ప్రముఖులు

సుకుమార్, రామ్ చరణ్ కలయికలో రూపుదిద్దుకున్న రంగస్థలం నిన్న రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ సినిమాని చూసిన సామాన్యులతో పాటు సెలబ్రిటీలు రంగస్థలం చిత్రయూనిట్ ని అభినందిస్తున్నారు. ఈ సినిమా గురించి ప్రముఖులు ఏమన్నారో వారి మాటల్లో…

రంగమ్మత్త గుర్తొస్తుంది..‘‘రంగస్థలం’ చిత్రం ద్వారా రామ్‌చరణ్‌లో నటనా నైపుణ్యం ఏ స్థాయిలో ఉందో తెలిసింది. సుకుమార్ తన సినిమాలోని పాత్రల నుంచి చక్కటి భావోద్వేగాలను, ప్రదర్శనను రాబట్టుకున్నారు.‌ ఇలాంటి వినూత్న సినిమాను తీసుకొచ్చిన ఆయన్ను ప్రశంసిస్తున్నా. థియేటర్‌ నుంచి బయటికి వచ్చిన తర్వాత రంగమ్మత్త గుర్తొస్తుంది. ఈ పాత్రకు అనసూయ పర్‌ఫెక్ట్‌. ప్రెసిడెంట్‌గా జగపతిబాబు అద్భుతంగా నటించారు. ఆర్ట్‌ వర్క్‌ అద్భుతంగా ఉంది. – గోపీమోహన్‌

గొప్పగా ప్రారంభమైన వేసవి ‘‘రంగస్థలం’ చూశా. చిట్టిబాబు అద్భుతమైన ప్రదర్శన. రామ్‌చరణ్‌ కెరీర్‌లోనే ఇది అత్యుత్తమంగా నటించిన చిత్రం. సుకుమార్‌ చక్కగా సినిమాను తెరకెక్కించారు. సమంత, ఆది పినిశెట్టి ఉత్తమంగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సూపర్‌. వేసవి చాలా గొప్పగా ప్రారంభమైంది’. – మారుతి

సుకుమార్‌.. సూపర్‌‘చిట్టిబాబు.. చిత్ర పరిశ్రమలో ఎప్పటికీ అలాగే ఉండిపోతాడు. సినిమాలోని ఆర్టిస్టులకు, సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు. రామ్‌చరణ్‌, సుకుమార్‌.. సూపర్‌’. – అనిల్‌రావిపూడి

సూపర్ డూపర్ రిపోర్ట్స్ రంగస్థలానికి అన్ని చోట్ల నుంచి సూపర్ డూపర్ రిపోర్ట్స్ వస్తున్నాయి. రామచరణ్ నటనను చూసేందుకు ఈ రోజు రాత్రి వెళ్తున్నాను. – అల్లు శిరీష్

ఉమ్మడి విజయం రామ్ చరణ్ తో పాటు రంగస్థలం చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెబుతున్నా.
– కోన వెంకట్

చింపేసాడు రాంచరణ్ చిట్టిబాబుగా చింపేసాడు. సమంత, అనసూయలు కూడా పాత్రలకు ప్రాణం పోశారు. దేవీ నేపథ్య సంగీతం అదుర్స్. – గోపీచంద మలినేని

రంగస్థలం నుంచి బయటికి రావాలని లేదు రంగస్థలం ఊరిలో నుంచి, మనుషుల నుంచి బయటికి రావాలని లేదు. అటువంటి అందమైన ప్రపంచాన్ని సుకుమార్ మనకి ఇచ్చారు. చరణ్ నాకు సోదరుడని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా. – సుష్మిత

రామలక్ష్మిగా సమంత ఒదిగిపోయింది చరణ్ అద్భుతంగా నటించాడు. రామలక్ష్మి పాత్రలో సమంత ఒదిగిపోయింది. సుకుమార్ ప్రతి పాత్రను చక్కగా మలిచారు. మైత్రి వారి ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. – శ్రీను వైట్ల

శుభాకాంక్షలు..‘రామ్‌ చరణ్‌ అద్భుత నటన, సుకుమార్‌ దర్శకత్వ శైలి‌, మైత్రీ మూవీ మేకర్స్‌, ‘రంగస్థలం’ సినిమాను విజయ పథంలో నడిపించాయి. ఈ విజయంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ పీకే క్రియేటివ్‌ వర్క్స్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతోంది’. – పీకే క్రియేటివ్‌ వర్క్స్‌

అదిరిపోయింది రంగస్థలం అదిరిపోయింది. ఇదేమాట గట్టిగా అరచి చెప్పండి చిట్టిబాబుకి వినపడాలి. సుకుమార్ సార్.. నేను మీ అభిమానిని. – నాని

ఎక్కువకాలం నిలిచి పోతాడు చిట్టి బాబు పాత్రని బాగా రాసారు. అలాగే బాగా నటించారు. ఈ పాత్ర ఎక్కువకాలం నిలిచి పోతుంది.
– వరుణ్ తేజ్

ఆస్కార్ బరిలో రంగస్థలంరంగస్థలం ఒక క్లాసిక్ మూవీ. చిట్టిబాబు ఎక్కువమార్కులు కొట్టేసాడు. ఆస్కార్ బరిలో నిలిచే సినిమాని అందించిన సుకుమార్ ని చూసి గర్వంగా ఉంది. – వెంకీ అట్లూరి

ఆమూలాయమైన సినిమాసుకుమార్ అమూల్యమైన చిత్రాన్ని అందించారు. రామ్ చరణ్ తన నటనతో చిట్టిబాబుని ఎక్కుకకాలం గుర్తుండిపోయేలా చేశారు. – సంపత్ నంది

చరణ్ అన్న.. మజాకాచరణ్ అన్న కోపం, సంతోషం, ప్రేమ, అమాయకత్వం, బాధ.. కామెడీ.. డాన్స్.. అన్ని అదరగొట్టారు. అతను చేయలేనిదంటూ లేదని నిరూపించారు. చరణ్ అన్నా.. మజాకానా. చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు. మైత్రి మూవీ మేకర్స్ వారికీ వినబడుతుందా.. మీ రంగస్థలం అదిరింది. – నిహారిక

రంగస్థలంపై సినీ ప్రముఖులు ప్రసంశలు గుప్పించడంతో వారికి సోషల్ మీడియా వేదికపై ఉపాసన కృతజ్ఞతలు తెలిపారు. “మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు” అంటూ ట్వీట్‌ చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus