ఫ్యాషన్ వరల్డ్ లో తెరవెనుక శ్రమించే వారి గురించి జనాలకు తెలియకపోయినప్పటికి సెలబ్రెటీలకు మాత్రం వారి టాలెంట్ గురించి బాగా తెలుస్తుంది. ఇక ఫ్యాషన్ ఇండస్ట్రీలో భారీగా సెలబ్రేటీల ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న వారిలో శిల్పా రెడ్డి ఒకరు. ఆమె ఆంధ్రప్రదేశ్లోని తెలుగు కుటుంబంలో జన్మించిన ఆమె టొరంటోలోని ప్రఖ్యాత అకాడమీ ఆఫ్ డిజైన్ లో కొన్నేళ్ల పాటు శిక్షణ తీసుకున్నారు.శిల్పా రెడ్డి ఫ్యాషన్ డిజైనింగ్ లో గ్లాడ్రాగ్స్ మిసెస్ టైటిల్ ను కూడా గెలుచుకున్నారు.
ఇక ఆమె అక్కినేని వారికి కాస్త దగ్గరి బంధువు కూడా. ఇక శిల్పా టాలెంట్ పై అక్కినేని సెలబ్రేటీలు నిత్యం ఏదో ఒక విధంగా కాంప్లిమెంట్స్ ఇస్తూనే ఉంటారు. ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా నాగార్జున ఫ్యామిలీ మొత్తం పార్టీకి వెళ్లారు. అమల, నాగచైతన్య , సమంత అందరూ కూడా శిల్పా రెడ్డితో కలిసి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు. మెగా డాటర్ సుస్మిత కొణిదెల, మంచు లక్ష్మి, అడివి శేష్ కూడా శిల్పా రెడ్డికి మంచి సన్నిహితులు.
ఇక పుట్టినరోజు వేడుకకు సంబంధించిన స్పెషల్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న శిల్పా కాస్త ఎమోషనల్ గానే వారికి కృతజ్ఞతలు తెలిపింది. స్నేహితుల ప్రపంచం కంటే మరొక గొప్ప కుటుంబం లేదని అంటూ వారితో ఈ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చినట్లు శిల్పా రెడ్డి వివరణ ఇచ్చారు.