అరవింద సమేతపై ప్రసంశలు గుప్పించిన సెలబ్రిటీలు

ఎన్టీఆర్ కి హిట్… త్రివిక్రమ్ కి ప్రశంసలు కొత్తేమీకాదు. కానీ అరవింద సమేత వీర రాఘవ మూవీ ఇచ్చిన విజయం మాత్రం ఇద్దరికీ కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ఇద్దరికీ ఏంటి టీమ్ మొత్తానికి తాము పడిన కష్టం మరిచిపోయేలా చేస్తోంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ మూవీ.. రికార్డులను నరుక్కుంటూ పోతోంది. అలాగే ప్రసంశల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రాన్ని చూసిన సెలబ్రిటీలు ఏమన్నారంటే..

తారక్ ఎంతటి నటుడో చూపించిన చిత్రం తారక్ ఎటువంటి నటుడో మనకి మరోసారి గుర్తుచేసిన చిత్రం అరవింద. త్రివిక్రమ్ నమ్మకాన్ని నిలబెట్టిన మూవీ. థమన్ మనసుపెట్టి సంగీతాన్ని ఇచ్చారు. పూజా హెగ్డే నటనతో పాటు డబ్బింగ్ కి పూర్తి ఎఫెక్ట్ పెట్టింది. చిత్రబృందానికి శుభాకాంక్షలు. – అఖిల్

త్రివిక్రమ్ ఒక్క అడుగు వంద అడుగుతో సమానం రాయల సీమలోని గొడవల నేపథ్యాన్ని తీసుకొని త్రివిక్రమ్ గారు దైర్యంగా అడుగువేశారు. అలాగే ఆ కథని అద్భుతంగా చూపించడంలో విజయం సాధించారు. తారక్ నటన ప్రతి సన్నివేశాన్ని ఎక్కువకాలం గుర్తుండిపోయేలా చేసింది. జగపతిబాబు గారు ఆశ్చర్యకరమైన నటనని ప్రదర్శించారు. – రాజమౌళి

సూపర్ హిట్ ఓబత్రివిక్రమ్ రచన, తారక్ యాక్టింగ్, రామలక్ష్మణ్ ప్రతిభ, థమన్ నేపథ్య సంగీతం కలిసి అరవిందని సూపర్ హిట్ చేసింది. ఇలాంటి పాత్రల్లో ఎన్టీఆర్ ని చూడలని చాలా రోజుల నుంచి ఎదురుచూశాం. ఇది త్రివిక్రమ్ వల్ల సాధ్యమైంది. – నితిన్

లవ్లీ పూజా అరవిందలో తారక్ నటన అమోఘం. జగపతి బాబు గారు అయితే ఎక్కువకాలం మైండ్ లో ఉండిపోతారు. పూజా హెగ్డే నువ్వు లవ్లీ. చిత్ర బృందానికి శుభాకాంక్షలు. – రాశీ ఖన్నా

నిర్మాత కమిట్మెంట్ నటీనటుల డెడికేషన్, డైరక్టర్ నమ్మకం, నిర్మాత కమిట్మెంట్ కలిస్తే అరవింద సమేత లాంటి అద్భుత చిత్రం రూపుదిద్దుకుంది. తారక్ ని చూస్తుంటే సంతోషంగా ఉంది. జగ్గు సార్ బ్రిలియంట్. – సాయి ధరమ్ తేజ్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus