అనేక వివాదాల నడుమ మర్చి 29 న(ఈరోజు) సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదలయ్యింది. ఎన్నికలు ఉండడంతో ఒక్క ఆంధ్రప్రదేశ్ మినహా తెలంగాణ, యూ.ఎస్ లో ఈ చిత్రం విడుదలయ్యింది. ఈ చిత్రంలో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు పై సెటైరికల్ గా రూపొందిందని అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ ఇవ్వడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఎందుకంటే.. సాధారణంగా ఆర్జీవీ చిత్రాలకి ‘ఏ’ రేటింగ్ మాత్రమే వస్తుందని అందరూ ఫిక్సయ్యారు. అయితే ఈ చిత్రంలో కొన్ని డైలాగులను తొలగించి (మ్యూట్ చేసి)… ఇలా ‘యూ’ రేటింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక సెన్సార్ బోర్డు వారు కట్ చేసిన ఆ డైలాగులు ఇవే :
“రాత్రిపూట కూడా నాన్నగారి తోటే ఉంటుందా”
“ఈ వయసులో కూడా మీకు ఆడవాళ్ళ మీద అంత కోరిక ఉంటె”
“మగ ఆడ కలిస్తే మాటలే ఉండవుగా”
“రాజకీయంగా కాదు వ్యక్తిగతంగా చచ్చిపోయినట్టే లెక్క”
“నాకన్నా మీకన్నా నా కొడుకు కన్నా నాకు”
“ముండ”
“దానికి మీకు ముట్టాల్సిన మూల్యం భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయినప్పుడు ముడుతుంది”
“గుంటనక్కల్ని”
“శారీరక”
“పడక గదిలో”
“ఈ ఎర్రి”
“చంద్రబాబు”
“తెలుగుదేశం”
“మీకు డబ్బు రూపంలోనే కాకుండా ఇంకా చాలా విధాలుగా మీరు ఊహించలేనంత”
“అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం”
ఇవి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు సెన్సార్ మ్యూట్ చేసిన డైలాగులు. అయితే యూ.ఎస్. లో మాత్రం ఎటువంటి ‘మ్యూట్’ లేకుండా డైలాగులు ఉంటాయట. అతనికి వర్మ అనుకున్నట్టు గానే సినిమా విడుదల చేసాడు. ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఈ చిత్రం విడుదల కావట్లేదు. సోషల్ మీడియా ప్లేట్ ఫామ్స్ అయిన ఫేస్బుక్, యూట్యూబ్ లలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయకూడదని స్టే ఇచ్చింది హై కోర్టు.
‘అయినా పైరసీ కాకుండా ఎవరు ఆపగలరు.. సినిమా విడుదల చేస్తే.. ఫ్యామిలీలో ఒకరిద్దరు మాత్రమే సినిమా చూస్తారు… కానీ విడుదల లేకుండా పైరసీ రిలీజ్ అయితే ఇంటిల్లిపాది చూస్తారు.. అప్పుడు బాబు కి మరింత దెబ్బ తగులుతుంది’ అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుండడం సంచలనంగా మారింది.