మెగా డాటర్ నిహారిక.. సినిమాల్లో పెద్దగా రాణించలేకపోయింది. దీంతో లాక్ డౌన్ టైంలో ఆమెకు చైతన్య జొన్నలగడ్డతో వివాహం చేశారు కుటుంబ సభ్యులు. రాజస్థాన్ ప్యాలెస్ లో ఆమె పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత నిహారిక సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ వచ్చింది.అయితే సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో టచ్ లోనే ఉంటూ వచ్చింది. 2021 ఎండింగ్ వరకు నిహారిక- చైతన్య లు హ్యాపీగా ఉన్నట్టు కనిపించారు. కానీ 2022 నుండీ పరిస్థితులు మారినట్టు అందరికీ తెలుస్తుంది.
అనూహ్యంగా ఆమె డ్రగ్స్ ఎక్కువగా వాడే పబ్ లో దొరకడంతో.. ఆమె లైఫ్ డిస్టర్బ్ అయినట్టు అంతా అనుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం నిహారిక, చైతన్య ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ ఫాలో కొట్టుకోవడంతో వీళ్ళు విడిపోయారు అనే వార్తలు ఊపందుకున్నాయి. అవి నిజమో కాదో.. అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ చైతన్య అప్పటి నుండి సోషల్ మీడియాలో కనిపించడం తగ్గించాడు. దాదాపు 4 నెలల గ్యాప్ తర్వాత అతను ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టాడు.
అందులో ఓ మెడిటేషన్ సెంటర్ ఫోటోలు షేర్ చేసి కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ‘నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన వారందరికీ థాంక్స్. మనం ఒక చోటికి ఏ ఆలోచనలు లేకుండా వెళ్తే.. అద్భుతమైన జ్ఞానంతో తిరిగొస్తాం. ఇది కూడా అలాంటిదే’ అంటూ రాసుకొచ్చాడు. చైతన్య పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారిందని చెప్పాలి.