Chaithu – Shobitha: సోషల్ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్ వైరల్
- July 27, 2026 / 07:43 PM ISTByFilmy Focus Desk
సోషల్ మీడియాలో తమ అభిమాన నటుల కామెంట్లు చూసి మురిసిపోతుంటారు నెటిజన్లు. అందులోనూ ఆ నటులు కపుల్స్ అయితే ఇంకానూ. ఇప్పుడు ఇదే జరుగుతోంది అక్కినేని హీరో, అతని వైఫ్ విషయంలో. ఇక్కడ అక్కినేని హీరో అంటే అఖిల్ అనుకునేరు. మామూలుగా సినిమా విడుదల సమయంలో ఇలా సోషల్ మీడియాలో మాట్లాడటం కొంతమంది హీరోలకు, సెలబ్రిటీ కపుల్స్‌కి అవాటు. కానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నాగచైతన్య, శోభిత దంపతులు అలా కాదు.
Chaithu – Shobitha
ఇక అసలు విషయానికొస్తే.. నాగచైతన్య తన భార్య శోభిత వంట చేసిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటో అలా వైరల్ అవ్వగా.. దానికి ఆమె రిప్లై మరింత వైరల్‌గా మారింది. పెళ్లయిన దాదాపు రెండేళ్లకు నా భార్య నా కోసం వంట చేసింది. బహుశా.. ఈ రోజు నేను ఏదో మంచి పనే చేసి ఉంటాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో శోభిత ఫొటోను నాగచైతన్య షేర్ చేశాడు. దానికి శోభిత రియాక్ట్ అవుతూ ‘నువ్వు నన్ను ట్రోల్ చేస్తున్నావా.. లేక పొగుడుతున్నావా’ అని రాసుకొచ్చింది.

దీంతో చైతు – శోభిత ముచ్చట్లు క్యూట్ కదూ అభిమానులు ఆ పోస్టుల స్క్రీన్ షాట్లను షేర్ చేసుకుంటున్నారు. రీసెంట్ టైమ్స్‌లో ఇద్దరూ ఇలా సోషల్ మీడియాలో మాట్లాడుకున్నది లేకపోవడంతో ఇప్పుడు ఈ ముచ్చట్లు ఆసక్తికరంగా మారాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. ‘తండేల్’ లాంటి భారీ విజయం అందుకున్న తర్వాత చైతన్య ప్రస్తుతం ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ అనే సినిమాలో నటిస్తున్నాడు.
ఇక శోభిత ‘చీకటిలో’ అనే సినిమాలో రీసెంట్‌గా కనిపించింది. ప్రస్తుతం పా.రంజిత్ దర్శకత్వంలో వస్తున్న తమిళ చిత్రం ‘వెట్టువం’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాను త్వరలో విడుదల చేస్తారు. పెళ్లికి ముందు చైతు, శోభిత ఎప్పుడూ కలసి నటించకపోవడంతో.. ఇప్పుడు నటిస్తే బాగుండు అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారో.










