కాలేజ్ లుక్ కోసం కండలు కరిగిస్తున్నాడు..!
- March 19, 2016 / 11:03 AM ISTByFilmy Focus
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ప్రేమమ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో మూడు పాత్రల్లో చైతన్య నటిస్తుండగా.. టీనేజ్ పాత్రలో నటించడం కోసం చైతు ప్రస్తుతం బరువు తగ్గుతున్నాడు.
‘టీనేజ్ పాత్రలో నటించడం కోసం బరువు తగ్గుతున్నాను.
ఇందుకోసం పలు వర్కవుట్లు కూడా చేస్తున్నాను. ఈ పాత్రలో నేను సరికొత్తగా కనిపించనున్నా’నని చైతు తెలిపాడు. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తుండగా.. చైతు సరసన శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ లు జంటగా నటిస్తున్నారు.
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చైతు నటిస్తున్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం టాకీ పార్ట్ పూర్తవగా.. పాటల చిత్రీకరణ మిగిలి ఉంది!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













