‘ఛల్ మోహన్ రంగ’ తొలి గీతం విడుదల

‘గ ఘ మేఘ .. నింగే మనకు నేడు పాగ’ అంటూ మన యువ కథానాయకుడు నితిన్ కథానాయిక మేఘా ఆకాష్ తో కలసి తన ప్రయాణం మొదలు పెట్టాడు.

వీళ్లిద్దరు నటిస్తున్న చిత్రం “ఛల్ మోహన్ రంగ”. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇంతకు ముందే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ మరియు టీజరుకు మంచి స్పందన రావడంతో చిత్ర బృందం చాలా ఆనందంగా ఉన్నారు.

మెలోడీల విషయంలో థమన్ ది ప్రత్యేక బాణి. ఆయన స్వరపరచిన ఈ పాట తన ముందు మెలోడీలలాగే ఎంతో వినసొంపుగా ఉంటుంది.

ఎంతో సరదాగా, చలాకీగా సాగిపోయే హీరో, హీరోయిన్ల ప్రయాణం లాగే, కె.కె. సాహిత్యం అందించిన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది.

యు.ఎసలో గల కీవెస్ట్, ఆమిష్ విలేజ్ లాంటి అందమైన ప్రదేశాలలో ఈ పాటను చిత్రీకరించారు. ఈ చిత్రానికి ఎన్. నటరాజన్ సుబ్రహ్మణ్యన్ సినీమాటోగ్రఫీ అందిస్తున్నారు. చిత్ర నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి చిత్రాన్ని ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు ప్రకటించారు.
‘నితిన్, మేఘా ఆకాష్’ జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం. ఇది నితిన్ కు 25 వ చిత్రం కావటం విశేషం. మాటల మాంత్రికుడు ,దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా,శ్రీమతి నిఖితారెడ్డి సమర్పణ లో ప్రముఖ నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని కృష్ణ చైతన్య దర్శకత్వం లో నిర్మిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus