జబర్దస్త్ కార్యక్రమం ద్వారా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి చలాకీ చంటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కార్యక్రమంలో తన అద్భుతమైన కామెడీ స్కిట్లతో అందరినీ నవ్వించిన ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొని సందడి చేశారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అయితే ఈ మధ్యకాలంలో చలాకి చంటి పెద్దగా సినిమాలలోను బుల్లితెర కార్యక్రమాలలో ఎక్కడ కనిపించడం లేదు.
చలాకి చంటి ఈ విధంగా పూర్తిగా ప్రేక్షకులకు దూరం కావడానికి కేవలం ఆయన అనారోగ్య సమస్యలు కారణమని తెలుస్తోంది. తాజాగా ఈయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనని నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారని, ప్రస్తుతం ఈయనకు ఐసియులో చికిత్స జరుగుతుందనీ తెలుస్తుంది.అసలు ఈయనకు ఏం జరిగింది? ఐసీయూలో చికిత్స తీసుకొనే అంతా అనారోగ్యానికి గురయ్యారా అంటే అవుననే మీడియా వర్గాలు చెబుతున్నాయి.
మీడియా సమాచారం ప్రకారం చలాకి చంటికి సీరియస్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని తెలుస్తుంది. ఇలా ఈయన హార్ట్ స్ట్రోక్ కి గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు తనని ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తుంది.ప్రస్తుతం తనకు సీరియస్ గానే ఉందని తాను ఐసీయూలోనే చికిత్స తీసుకుంటున్నారనే వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి ఎక్కడ చలాకి చంటి, కుటుంబ సభ్యులు సన్నిహితులు ఈ విషయం గురించి మాట్లాడటం లేదు.
ఇలా చలాకి చంటి ఆరోగ్యం గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే చంటి నిజంగానే అనారోగ్యానికి గురయ్యారా లేదా అనే విషయం తెలియదు కానీ ఈయన గురించి ఇలాంటి వార్తలు వస్తున్న తరుణంలో ఈయన క్షేమంగా బయటకు రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.