జబర్దస్త్ షోతో బుల్లితెరకు, ఆ తర్వాత వెండితెరకు పరిచయమైన కమెడియన్ చమ్మక్ చంద్ర. జబర్దస్త్ తోపాటు సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో రాణించడంతో మనోడికి అడపాదడపా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అరవింద సమేతలోను చమ్మక్ చంద్ర కడుపుబ్బ నవ్వించాడు. జబర్దస్త్ లో పెళ్ళాల బిహేవియర్ మీద స్కిట్స్ చేస్తూ ఫ్యామిలీ మేన్ అనిపించుకున్న చమ్మక్ చంద్ర. రీసెంట్ గా “రామ సక్కనోళ్ళు” అనే సినిమాలో నటించాడు. ఆ సినిమాకి సంబంధించిన ఒక వీడియో సాంగ్ ను విడుదల చేశారు.
ఆ సాంగ్ బీగ్రేడ్ సినిమాకి ఎక్కువ, సీ గ్రేడ్ సినిమాకి తక్కువ అన్నట్లుగా ఉంది. నిన్నటివరకూ క్లీన్ ఇమేజ్ ఉన్న చమ్మక్ చంద్ర ఈ ఒక్క పాటతో బ్యాడ్ ఇమేజ్ దక్కించుకోవడమే కాక అనవసరంగా బ్యాడ్ అయిపోయాడు. మరి డ్యామేజ్ అయిన ఇమేజ్ ను సెట్ చేసుకోవడం కోసం చమ్మక్ చంద్ర ఏమైనా చేస్తాడో లేక లైట్ తీసుకొంటాడో చూడాలి.