చాణక్య సినిమా రివ్యూ & రేటింగ్!

అప్పుడెప్పుడో 2014లో వచ్చిన “లౌక్యం” తర్వాత గోపీచంద్ మళ్ళీ హిట్ కొట్టి చాలా ఏళ్లవుతోంది. మధ్యలో వచ్చిన “జిల్, సౌఖ్యం, గౌతమ్ నంద, ఆక్సిజన్, ఆరడుగుల బుల్లెట్, పంతం” డిజాస్టర్లుగా నిలవడంతో గోపీచంద్ కెరీర్ ఇరకాటంలో పడింది. తమిళ దర్శకుడు తిరు తెలుగు తెరకు పరిచయమవుతూ తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ “చాణక్య” గోపీచంద్ కెరీర్ కి చాలా కీలకం. మరి ఈ సినిమాతోనైనా గోపీ హిట్ అందుకున్నాడో లేదో చూద్దాం..!!

కథ: ఓ సాధారణ బ్యాంక్ ఎంప్లాయి రామకృష్ణ (గోపీచంద్). మేనేజర్ ఇచ్చే టార్గెట్ రీచ్ అవ్వడానికి నానా ఇబ్బందులు పడుతుంటాడు. అతడి మంచితనం చూసి ప్రేమిస్తుంది మెహరీన్. కానీ.. అందరు అనుకొంటున్నట్లు రామకృష్ణ ఓ సాధారణ బ్యాంక్ ఎంప్లాయి మాత్రమే కాదని అండర్ కవర్ రా ఏజెంట్ అని తెలుసుకొంటారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన ఖురేషీ (రాజేష్ ఖత్తార్)ను పట్టుకోవడం కోసం నియమించబడతాడు. ఆ క్రమంలో అతడికి మరో రా ఏజెంట్ (జరీన్ ఖాన్) సహాయపడుతుంటుంది.

ఈ మిషన్ లో చివరికి ఎవరు గెలిచారు? రామకృష్ణ అలియాస్ అర్జున్ పాకిస్తాన్ వెళ్ళి ఆ క్రిమినల్స్ ను ఎలా పట్టుకొన్నాడు? అనేది “చాణక్య” కథాంశం.

నటీనటుల పనితీరు: ఈ తరహా రోల్స్ చేయడం అనేది గోపీచంద్ కి కేక్ వాక్ లాంటిది. చాలా సునాయాసంగా రా ఏజెంట్ బాడీ లాంగ్వేజ్ లోకి సెట్ అయిపోయాడు. ఫైట్స్ & మ్యానరిజమ్స్ తో ఆకట్టుకొన్నాడు. మాస్ ఆడియన్స్ ను గోపీచంద్ ఎప్పుడు నిరాశపరచడు. వారికోసమే అన్నట్లుగా కొన్ని ఫైట్స్ & సాంగ్స్ ను ప్లాన్ చేసుకొన్నాడు.

మెహరీన్ అక్కడక్కడా కనిపించి మాయమవుతుంటుంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ జరీన్ ఖాన్ కి మంచి రోల్ దొరికింది. అందివచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకొంది ఆమె. గ్లామర్ తో మాత్రమే కాక పెర్ఫార్మెన్స్ తోనూ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది.

ఉపేన్ పటేల్, రాజేష్ ఖత్తార్ ల విలనిజం బాగుంది కానీ.. డెప్త్ కొరవడింది. ఆ కారణంగా సినిమాలో ఒక స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది లేకుండాపోయింది.

కామెడీ మరీ ఇబ్బందికరంగా ఉంది. మరీ ముఖ్యంగా ఆ కుక్కల బ్రీడింగ్ కామెడీని అసలు గోపీచంద్ ఎలా యాక్సెప్ట్ చేశాడు అనేది గమనార్హం.

సాంకేతికవర్గం పనితీరు: విశాల్ చంద్రశేఖర్ పాటల కంటే శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం బాగుంది. వెట్రీ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ప్రొడక్షన్ వేల్యూస్ కొన్ని సన్నివేశాల్లో పర్లేదు కానీ.. కొన్ని చోట్ల మరీ పేలవంగా అనిపిస్తాయి. యాక్షన్ సీన్స్ కు మాత్రం బాగానే ఖర్చు చేశారు. అలాగే.. ఆ హెడ్ క్వార్టర్స్ & ఏజెంట్ ఆఫీసుల సెటప్పుల విషయంలోనూ కాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది.

దర్శకుడు తిరు మాములుగానే కొరియన్ & హాలీవుడ్ సినిమాల నుంచి భారీగా స్పూర్తి పొందుతుంటాడు. అతడి మునుపటి సినిమాలైన “ఇంద్రుడు, వేటాడు వెంటాడు” చూస్తే ఆ విషయం అర్ధమవుతూనే ఉంటుంది. అయితే.. “చాణక్య” కోసం మరీ ఎక్కువగా హాలీవుడ్ సినిమాల మీద ఆధారపడిపోయాడు. రెగ్యులర్ గా హాలీవుడ్ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఆయా సన్నివేశాలను బట్టి ఆయా హాలీవుడ్ సినిమాలు గుర్తొస్తూనే ఉంటాయి. ఇక హాలీవుడ్ సినిమాలు చూడని సగటు ప్రేక్షకుడి పరిస్థితి ఏంటంటే.. “ఇది ఇండియన్ రా ఏజెంట్ స్థాయి వ్యక్తి చేసే పనేనా?” అని కన్ఫ్యూజ్ అవుతుంటాడు. చాలా లోకల్ ఇష్యూస్ ను ఇండియన్ ఇంటిలిజెన్స్ ను లింక్ చేసి కథను-కథనాన్ని సాగదీసిన విధానం హాస్యాస్పదం. ఇక ఆ కుక్క బ్రీడింగ్ అనే సీక్వెన్స్ లో అంత కామెడీ ఏముంది అని దర్శకుడికే తెలియాలి. ఇక ప్రతి క్యారెక్టర్ ను స్లో మోషన్ లో ఇంట్రడ్యూస్ చేసి.. 157 నిమిషాల సినిమాలో దాదాపు 30 నిమిషాలు స్లోమోషన్ షాట్స్ కే ఎందుకు అంకితం చేసేశాడో కూడా అర్ధం కాదు.

విశ్లేషణ: హిట్ కొడదామని గోపీచంద్ ఎంత బలంగా ప్రయత్నించినా.. దర్శకుల పనితనం పుణ్యమా అని ఫెయిల్ అయిపోతున్నాడు. ఈ చాణక్య కూడా ఆ కోవలోకి వచ్చే సినిమానే. ఆల్రెడీ “సైరా” తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడుతోంది, శనివారం రిలీజ్ కి ఓపెనింగ్స్ లేవు, రేపటికి బుకింగ్స్ లేవు. దసరా సెలవులు ఉన్నా.. కంటెంట్ కారణంగా అన్నీ వర్గాల ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించరు. సొ, గోపీచంద్ కష్టం మళ్ళీ ఫెయిల్ అయిందనే చెప్పాలి.

రేటింగ్: 1.5/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus