అప్పుడెప్పుడో ‘లౌక్యం’ సినిమాతో హిట్టు కొట్టాడు యాక్షన్ హీరో గోపిచంద్. 2014 లో విడుదలైన ఈ చిత్రం గోపీచంద్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తరువాత చేసిన ‘జిల్’ అబొవ్ యావరేజ్ గా నిలిచినా.. అటుతరువాత వచ్చిన ‘సౌఖ్యం’ ‘గౌతమ్ నంద’ ‘ఆక్సిజన్’ చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఎన్నో అసలు పెట్టుకుని చేసిన 25 వ చిత్రం ‘పంతం’ కూడా యావరేజ్ గా నిలిచింది. దీంతో ఈసారి ఎలా అయినా హిట్టు కొట్టాలనే కసితో ‘చాణక్య’ అనే సినిమా చేసాడు. ‘వేటాడు వెంటాడు’ ఫేమ్ తిరు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘ఏకే ఎంటెర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించాడు.
ఈరోజు విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తుండడం విశేషం. ‘సైరా నరసింహా రెడ్డి’ వంటి భారీ చిత్రంతో పోటీగా వస్తుంది అంటే.. సాధారణ విషయం కాదు. అయినప్పటికీ ఈ చిత్రం మంచి ఆదరణ దక్కించుకుంటుంది. ఇక ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది.
‘చాణక్య’ ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 3.70 cr |
సీడెడ్ | 2 cr |
ఉత్తరాంధ్ర | 1.25 cr |
ఈస్ట్ | 0.80 cr |
వెస్ట్ | 0.70 cr |
కృష్ణా | 0.80 cr |
గుంటూరు | 1.05 cr |
నెల్లూరు | 0.40 cr |
ఏపీ + తెలంగాణ | 10.70 cr |
రెస్ట్ అఫ్ ఇండియా | 0.70 cr |
ఓవర్సీస్ | 0.60 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 12 cr |
ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 12 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘సైరా’ పోటీని తట్టుకుని.. దసరా సెలవుల్ని ఉపయోగించుకుని ప్రమోషన్లు చేసుకుంటే అది పెద్ద కష్టమైన టార్గెట్ ఏమీ కాదనే చెప్పాలి.
చాణక్య సినిమా రివ్యూ & రేటింగ్!
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!
సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్