Chandra Mohan: నా దగ్గర అప్పు చేస్తే ఆ హీరో కి బాగా కలిసి వస్తుందట: చంద్రమోహన్

సినిమా ఇండస్ట్రీ లో స్వర్ణ యుగం లో సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన హీరోలలో ఒకడు శోభన్ బాబు. సోగ్గాడిగా పేరు తెచ్చుకున్న ఈ దిగ్గజ నటుడికి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఈయన సినిమా వచ్చిందంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్స్ లో నిల్చొని టికెట్స్ కోసం కొట్టుకునేవారు. ఆ స్థాయిలో ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరో మన ఇండస్ట్రీ లో ఇంకా పుట్టలేదు.

వెంకటేష్, జగపతి బాబు, శ్రీకాంత్ మరియు మహేష్ బాబు, ఇలా ఎంతో మంది హీరోలు ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ సంపాదించుకున్నప్పుడు శోభన్ బాబు తో పోల్చి చూసేవాళ్ళు విశ్లేషకులు. ఆ స్థాయి ఆదరాభిమానాలు దక్కించుకున్న కథానాయకుడు ఆయన. అంతే కాదు సినిమాల ద్వారా సంపాదించుకునే డబ్బుని వందల కోట్ల రూపాయిల ఆస్తులుగా మలచుకోవడం ఎలా అనే అంశాన్ని ఇండస్ట్రీ లో ఎంతో మందికి నేర్పించాడు.

ఆయన అడుగుజాడల్లో నడిచి ఇండస్ట్రీ లో టాప్ స్టార్స్ ఎంతో మంది అప్పట్లో సంపాదించిన డబ్బుని భూమి మీద పెట్టుబడి పెట్టి నేడు వేలకోట్ల రూపాయలకు అధిపతులుగా నిలిచారు. శోభన్ బాబు బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరు చంద్ర మోహన్. నిన్ననే ఈయన స్వర్గస్తులు అయిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోక సంద్రంలోకి నెట్టేసింది. ఇదంతా పక్కన పెడితే గతం లో ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో శోభన్ బాబు కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘వేల కోట్ల రూపాయలకు అధిపతి అయిన శోభన్ బాబు తన దగ్గర అప్పులు చేసేవాడు. ఆయన నన్ను అప్పు అడిగినప్పుడు నేను ఆశ్చర్యపోయేవాడిని. నా దగ్గర అప్పు చేస్తే అతనికి బాగా కలిసి వస్తుందట. అందుకే భూమి కొన్నప్పుడల్లా నా దగ్గర అప్పు చేసేవాడు’ అంటూ చంద్రమోహన్ (Chandra Mohan) చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus