Chandra Mohan: కృష్ణ విజయనిర్మల పెళ్లి పెద్దగా వ్యవహరించిన చంద్రమోహన్!

తెలుగు సీనియర్ నటుడు చంద్రమోహన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నేడు మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఈయన మరణించడంతో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలందరూ కూడా ఈయన మరణం పై స్పందిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక చంద్రమోహన్ మరణించడంతో ఈయనకు సంబంధించిన ఎన్నో వార్తలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. సూపర్ స్టార్ కృష్ణ విజయ్ నిర్మల రెండో పెళ్లి చేసుకోవడం వెనుక కూడా చంద్రమోహన్ ఉన్నారంటూ ఒక వార్త వైరల్ గా మారింది.

సూపర్ స్టార్ కృష్ణ విజయనిర్మల రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న సమయంలో విజయ నిర్మలతో కలిసి పలు సినిమాలలో నటించారు. అలాగే విజయనిర్మల డైరెక్షన్లో కృష్ణ ఎన్నో సినిమాలలో హీరోగా చేశారు. ఇలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడటం అనంతరం వీరిద్దరు పెళ్లి చేసుకోవడం జరిగింది. అప్పటికే విజయ్ నిర్మలకు వేరే వ్యక్తితో పెళ్లి జరిగి పిల్లలు ఉన్నారు.

కృష్ణకి కూడా ఇందిరా దేవితో పెళ్లి జరిగే పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ వీరిద్దరూ కలిసి తిరుపతిలో వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి జరగడం వెనుక చంద్రమోహన్ హస్తం చాలా ఉందని తెలుస్తుంది. ఇద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడటమే కాకుండా ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. ఇది గమనించిన చంద్రమోహన్ పెళ్లి చేసుకోమని సలహా ఇవ్వడమే కాకుండా తిరుపతిలో దగ్గరుండి వీరి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇలా చంద్రమోహన్ కారణంగా కృష్ణ విజయనిర్మల పెళ్లి చేసుకున్నారు. ఇలా వీరి పెళ్లికి ఈయన పెద్దగా మారిపోయారు.

చంద్రమోహన్ దగ్గరుండి కృష్ణ విజయ్ నిర్మల పెళ్లి చేయడంతో వారిద్దరూ ఈయన పట్ల ఎంతో కృతజ్ఞతా భావంతో ఉండేవారు అలాగే ఫిలింనగర్ లో ఇద్దరు కూడా ఎదురెదురుగా ఇల్లు కొనుగోలు చేయడంతో తరచూ వెళ్తూ ఉండేవారు. విజయనిర్మల చంద్రమోహన్ ని అన్నయ్య అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించడమే కాకుండా విజయనిర్మల దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నింటిలో కూడా ఈయనకు అవకాశం కల్పించే వారట. ఈ విధంగా కృష్ణ చంద్రమోహన్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉండేది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus