శర్వానంద్ హీరోగా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి చంద్రమోహన్ దర్శకత్వం వహించనున్నారు. శర్వానంద్ కు చంద్ర మోహన్ ఓ కథ చెప్పగా.. అది శర్వానంద్ కు నచ్చడంతో ఈ కథలో నటించడానికి ఆయన అంగీకారం తెలిపారని శర్వానంద్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుండగా..బివిఎస్ఎన్ నిర్మించిన ‘డార్లింగ్’ చిత్రానికి చంద్రమోహన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. మరోవైపు ఈ చిత్రం తరువాత కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించనున్న చిత్రంలో కూడా శర్వానంద్ నటించనున్నాడు.