విమర్శల ధాటికి నిత్యా మారిపోయిందా..?

కర్లీ హెయిర్ క్యూట్ పేస్ కొంచెం హైట్ తక్కువైనా కానీ హీరోయిన్ గా నిత్యా మీనన్ సూపర్ సక్సెస్ అయ్యింది. తెలుగులో ఆమె నటించిన అలా మొదలైంది, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాలు మంచి విజయాలు నమోదు చేశాయి. స్టార్ హీరో ఎన్టీఆర్ సరసన కూడా నటించే ఛాన్స్ దక్కించుకుంది నిత్యా. తెలుగులో చిత్రాలు చేస్తూనే సౌత్ లో అన్ని పరిశ్రమలలో నటించింది నిత్యా మీనన్. ఇక ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు మూవీలో సావిత్రి పాత్రలో తళుక్కున మెరిసిన ఈ అమ్మడుకి తెలుగులో అవకాశాలు తగ్గాయి అనాలి.

గత ఏడాది హిందీ చిత్రం మిషన్ మంగళ్ మూవీలో ఆమె ఓ కీలక రోల్ చేశారు. బ్రీత్ అనే వెబ్ సిరీస్ లో నటించిన నిత్యా మీనన్ హీరో అభిషేక్ బచ్చన్ తో స్క్రీన్ పంచుకుంది. కాగా ఈ నిత్యా ఈ మధ్య బాగా లావైపోయారు. హైట్ కూడా తక్కువ కావడంతో నిత్యా మీనన్ షేప్ అవుట్ అయిన భావన ప్రేక్షకులకు కలిగింది. సోషల్ మీడియాలో కూడా నిత్యా ఫోటోలపై భారీగా ట్రోలింగ్ నడించింది. ఒక విధంగా చెప్పాలంటే బాడీ షేమింగ్ కి నిత్యా గురైంది.

విమర్శల నుండి రియలైజ్ అయ్యిందో ఏమో తెలియదు కానీ, నిత్యా కొంచెం సన్నబడిన భావన కలుగుతుంది. తాజా ఫొటోలలో నిత్యా గతం కంటే కొంచెం సన్నగా కనిపిస్తున్నారు. నేడు నిత్యా హైదరాబాద్ ఛార్మినార్ ని సందర్శించారు. ఛార్మినార్ ముందు ఆమె దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవున్నాయి.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus